శంషాబాద్ రూరల్, మార్చి 20 : షార్ట్ సర్క్యూట్తో నిర్మాణంలో ఉన్న కన్వెన్షన్ దగ్ధమైన సంఘటన గురువారం తొండుపల్లిలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ మున్సిపాలిటీ తొండుపల్లి రెవెన్యూ పరిధిలోని నూతనంగా నిర్మాణం చేపడుతున్న ఈకేఏఎం కన్వెన్షన్లో గురువారం వెల్లింగ్ పనులు చేస్తుండగా షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చేలరేగి పంక్షన్హాల్ మొత్తం వ్యాపించాయి.
వెంటనే స్థానికులు భయాందోళనకుగురై ఫైర్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న సిబ్బంది రెండు గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. దాదాపు కన్వెన్షన్ పూర్తిగా దగ్ధమై 7 కోట్ల రూపాయల ఆస్తినష్టం జరిగిన్నట్లు యాజమాన్యం వివరించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరేందర్రెడ్డి తెలిపారు.