హైదరాబాద్ : గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో సినీ నటుడు కృష్ణుడు పాల్గొన్నాడు.
తన పుట్టిన రోజు సందర్భంగా కుమార్తె నిత్యతో కలిసి కొండాపూర్‌లోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కృష్ణుడు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు.
ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్‌కు అభినందనలు తెలియజేసారు.
ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ ఆధారపడి ఉంటుందన్నారు.