దుండిగల్, మే 8: బైక్ పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదంలో ఇద్దరిపై దాడికి పాల్పడిన ఐదుగురు నిందితులను బాచుపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసుల కథనం ప్రకా రం… నిజాంపేటలోని ఇందిరమ్మ కాలనీ ఫేస్ -1లో గుడిపల్లి సంతోశ్‌కుమార్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు.
అయితే అదే బ్లాక్ లోని ఓ ఫ్లాట్‌లో బిహార్‌కు చెందిన ధీరజ్ కుమార్ అద్దెకు ఉంటుండగా సమీపంలోని వేరువేరు బ్లాకుల్లో అతని దగ్గరి బంధువులు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సంతోశ్‌కు చెందిన బైక్ పార్కింగ్ స్థలంలో ధీరజ్ కుమార్ తరచూ బైక్ పార్కింగ్ చేస్తున్నాడు. పక్కకు జరపమని చెబితే గొడవకు దిగేవా డు. ఈ క్రమంలో ఈనెల 6న రాత్రి 11 :30 గంటల సమయంలో ధీరజ్ కుమార్ బంధువు ఒకరు సంతోశ్‌కు చెందిన పార్కింగ్ స్థలంలో ద్విచక్ర వాహనాన్ని పా ర్క్ చేశాడు.
అయితే సంతోశ్.. బైక్‌ను పక్కకు పెట్టమని ధీరజ్‌కుమార్ బంధువుకు చెప్పి.. ఇంట్లోకి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి అనంతరం ధీరజ్ కుమార్ బయటకు వచ్చి సంతోష్‌తో గొడవ పడి కొట్టాడు. పక్కబ్లాక్లో నివాసం ఉంటున్న బంధువులు సం తోశ్సింగ్, రోహిత్ కుమార్ సింగ్, మరో ఇద్దరు వచ్చి ఇనుప రాడ్లు, కర్రలతో సంతోశ్‌ను కొట్టి గాయపరిచారు. అడ్డుకోబోయి న సంతోశ్ బంధువు అబ్రహంపైన దాడికి తెగబడ్డారు. ఈ దాడుల్లో వారిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాధితులు పో లీసులకు ఫిర్యాదు చేయగా నిందితులైన ధీరజ్‌కుమార్, కుమార్ సింగ్, రామ్ రతన్ సింగ్, సంతోశ్సింగ్, రోహిత్ సింగ్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.