
ముషీరాబాద్/కవాడిగూడ, జనవరి 29: అడిక్‌మెట్ డివిజన్లోని పలు బస్తీల్లో శనివారం వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికీ ఫీవర్ సర్వే చేపట్టారు. డివిజన్లోని టీఆర్టీ క్వార్టర్స్, రాంనగర్, దయానంద్ నగర్ ప్రాంతాల్లో స ర్వేను టీఆర్ఎస్ నాయకులు పర్యవేక్షించారు. అడిక్‌మెట్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు బి. శ్రీనివాస్‌రెడ్డి, సురేంద ర్, మహ్మద్ ఖదీర్, ఎ.శ్రీనివాస్, రవియాదవ్, అమ్జద్, రమేశ్, గురుదీప్ పాల్గొన్నారు.
కవాడిగూడ : కరోనా కట్టడిలో భాగంగా ఇంటిం టి జ్వర సర్వే ముషీరాబాద్ నియోజక వర్గంజోరుగా సాగుతున్నది. ముషీరాబాద్, భోలక్‌పూర్, కవాడిగూడ, గగన్‌మహల్ తదితర దవాఖానల పరిధిలో వైద్యాధికారులు డాక్టర్ కృష్ణమోహన్ రావు, డాక్టర్ రవికుమార్, డాక్టర్ రాజ్యలక్ష్మీల ఆధ్వర్యంలో రెండో డోసులు టీకాలు వేసుకున్నారా లేదా అంటూ వైద్య సిబ్బంది వెళ్లి బాధితులను గుర్తించి మందులు పంపిణీ చేశారు.