మేడ్చల్ /జవహర్‌నగర్/ పీర్జాదిగూడ / శామీర్‌పేట, ఆగస్టు 3: మాటతప్పని మహానేత, రైతుబాంధవుడు కేసీఆర్ అని రైతులు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ఖజానాపై భారం పడినా రైతు రుణమాఫీకి పూనుకున్నారని వారు అన్నా రు. కేసీఆర్ రైతు రుణమాఫీ ప్రకటించిన నేపథ్యంలో గురువారం మేడ్చల్ నియోజకవర్గ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్ర పటానికి రైతులు, బీఆర్స్ శ్రేణులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు బీఆర్ఎస్ అందిస్తున్న సాయం దేశంలోని ఏ రాష్ట్ర రైతుకు అందడం లేదన్నారు. 24 గంటల కరెంట్, రైతుబంధు, రైతుబీమా, సాగునీటి ప్రాజెక్టులు, సకాలంలో ఎరువులు, విత్తనాలు ఇలా రైతుకు కావాల్సిన ప్రతీది రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందన్నారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత విధానాలే రైతు రుణమాఫీ ఆలస్యమైందని, ఎన్ని కష్టాలు ఎదురైనా సీఎం కేసీఆర్ వెనకడుగు వేయలేదని అన్నారు.
మేడ్చల్‌లో అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించిన కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నారెడ్డి నందారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, మాజీ చైర్మన్ సత్యనారాయణ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, ఉపాధ్యక్షుడు రఘుపతి రెడ్డి, మాజీ జడ్పీటీసీ శైలజాహరినాథ్, వైఎస్ ఎంపీపీ వెంకటేశం, పీఏసీఎల్ చైర్మన్లు రణదీప్‌రెడ్డి, సురేశ్ రెడ్డి, కౌన్సిలర్ మహేశ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు బలరాంరెడ్డి, మున్సిపాలిటీ అధ్యక్షుడు శేఖర్ గౌడ్, నాయకులుశ్రీనివాస్ రెడ్డి, రాజమల్లారెడ్డి, నర్సింహారెడ్డి, అశోక్, యూనిస్పాష, శ్రీకాంత్ రెడ్డి, మధుకర్ యాదవ్, విష్ణుచారి, జీవన్, శంకర్, మునీరాబాద్ సర్పంచ్ గణేశ్, శ్రీనివాస్ రెడ్డి, నరేందర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
జవహర్‌నగర్ కార్పొరేషన్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో రైతు రుణమాఫీ, ఆర్టీసీని ప్రభుత్వంలో వీలినం చేయడంపై బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో మేయర్ కావ్య, కార్పొరేటర్లు వేణు, చిత్రాసుబ్రహ్మణ్యం, శారదామనోధర్రెడ్డి, సంగీతారాజశేఖర్, లావణ్యసతీష్గౌడ్, కోఆప్షన్‌సభ్యులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. పీర్జాదిగూడలోని పార్టీ కార్యాలయం వద్ద మేయర్ వెంకట్ రెడ్డి రైతులతో కలిసి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్పొరేటర్లు, రైతులు, నాయకులు పాల్గొన్నారు.
రైతు రుణ మాఫీని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఉమ్మడి శామీర్‌పేట మండలంలోని రైతులు, రైతుసంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు సంబురాలు నిర్వహించారు. మూడుచింతలపల్లి, శామీర్‌పేట మండలంలోని అలియాబాద్ చౌరస్తా, శామీర్‌పేట గ్రామాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, రైతుబంధుసమితి మం డల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ఎంపీపీ ఎల్లూభాయిబాబు, జడ్పీటీసీ అనితలాలయ్య, సర్పంచ్ కుమార్‌యాదవ్, ఏఎంసీ డైరెక్టర్ మాధవి, హనుమాన్‌దాస్, మల్లేశ్‌యాదవ్,శ్రీనివాస్‌గౌడ్, వెంకట్‌రెడ్డి,రవీందర్, అశోక్, జ్యోతి, మూడుచింతలపల్లి మండలంలో ఎంపీపీ హారికమురళిగౌడ్, సర్పంచ్‌లు జామ్ రవి, ఆంజనేయులు, గోపాల్, లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.