రకరకాల రాఖీలు
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండగను ఘనంగా జరుపుకొనేందుకు నగరం సమాయత్తమవుతున్నది. ఈ నేపథ్యంలో రాఖీల తయారీ, అమ్మకాలు గ్రేటర్లో ఊపందుకున్నాయి. ఇప్పటికే రహదారుల వెంట విక్రయ కేంద్రాలు వెలిశాయి.
- కాలానికి అనుగుణంగా సరికొత్త వెరైటీలు
- నగరంలో మొదలైన ’రక్షాబంధన్’ సందడి
- వైవిధ్యమైన రాఖీలకు మంచి ఆదరణ
- రహదారుల వెంట వెలిసిన విక్రయ కేంద్రాలు
- ఫ్యాన్సీ, బంగారం, వెండి రాఖీలకు మంచి డిమాండ్
అబిడ్స్, ఆగస్టు 10 : అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండగను ఘనంగా జరుపుకొనేందుకు నగరం సమాయత్తమవుతున్నది. ఈ నేపథ్యంలో రాఖీల తయారీ, అమ్మకాలు గ్రేటర్లో ఊపందుకున్నాయి. ఇప్పటికే రహదారుల వెంట విక్రయ కేంద్రాలు వెలిశాయి. వైవిధ్య రాఖీలకు మంచి ఆదరణ ఉండటంతో ఎప్పటిలాగే ఈ సారి కూడా సరికొత్త రాఖీలు మార్కెట్లో సందడి చేస్తున్నాయి.

రాఖీల తయారీకి..
రాఖీల తయారీకి పేరుగాంచిన ధూల్‌పేట్, రహీంపురా తదితర ప్రాంతాల్లో రకరకాల రాఖీలను రూపొందిస్తున్నారు. ఇక్కడి రాఖీలతో పాటు ముంబై, కోల్కత్తా, గుజరాత్ తదితర రాష్ర్టాల నుంచి ఫ్యాన్సీ రాఖీలను వ్యాపారులు దిగుమతి చేసుకొని అమ్మకాలు చేపడుతున్నారు. ధూల్‌పేట, రహీంపురా ప్రాంతాల్లో తయారైన రాఖీలను కొనుగోలు చేసేందుకు నగరంతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వ్యాపారులు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తుంటారు. రంగు, రంగుల దారాలు, వివిధ రకాల పూసలు, వెండి రాఖీలు, బంగారు పూతతో తయారు చేసిన వివిధ ఆకృతుల రాఖీలకు మంచి డిమాండ్ ఉన్నది. రూపాయి నుంచి మొదలుకొని వెయ్యి రూపాయల వరకు రాఖీలు అందుబాటులో ఉన్నాయి.

పెద్ద ఎత్తున రిటైల్ దుకాణాలు
రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని నగరంలోని పలు ప్రాంతాల్లో రాఖీలు విక్రయించేందుకు రిటైల్ దుకాణాలు పెద్ద ఎత్తున కొలువుదీరాయి. ఇప్పటికే కోఠి, బేగంబజార్, సిద్దంబర్‌బజార్, గోషామహల్, నాంపల్లి, మల్లెపల్లి తదితర ప్రాంతాల్లో రాఖీ దుకాణాలు ఏర్పాటు చేశారు. రకరకాల రాఖీలతో పాటు ఫ్యాన్సీ వాటికి అధికంగా గిరాకీ ఉన్నదని వ్యాపారులు చెబుతున్నారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా విభిన్న రాఖీలను విక్రయించేందుకు సిద్ధంగా ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే బంగారం, వెండితో పాటు అమెరికన్ డైమండ్స్‌తో రూపొందించిన రాఖీలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు.

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

