మారేడ్‌పల్లి : ఆస్ట్రేలియాలో ఇటీవలే ఉన్న త విద్యను పూర్తి చేసి…ఉద్యోగంలో చేరి రెండు నెలలు కూడ గడవక ముందే, ప్రమాదవ శాత్తు స్విమ్మింగ్‌పూల్‌లో పడి నగరానికి చెందిన యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్లితే…సికింద్రాబాద్ రెజిమెంటల్‌బజార్ ప్రాంతానికి చెందిన ఆర్. శ్రీనివాస్, అరుణల కుమారుడు రాచకొండ సాయిసూర్య తేజ ఇక్కడే బీటెక్ పూర్తి చేసి 2019లో ఎంఎస్ కోసం అస్టేలియాలకు వెళ్లాడు.
రెండు నెలల క్రితం చదువు పూర్తి కావడంతో సివిల్ ఇంజినీర్‌గా అక్కడే ఉద్యోగంలో చేరారు. ఈ నెల 7న ఆస్టేలియా బ్రిస్బన్లోని తాను నివాసం ఉండే గోల్డెన్ కాస్ట్ రిసార్ట్లోఉన్న సిమ్మింగ్ పూల్‌లో ప్రమాదవశాత్తు పడిపోయి మరణించాడు. సాయి సూర్య తేజ అక్టోబర్ 2020లో ద్విచక్రవాహనం పై వెళ్తుండగా కారు ఢీ కొన్న ప్రమాదంలో సాయి సూర్య తేజ కాలు పూర్తిగా దెబ్బతింది.
ఆ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయట పడిన సాయి సూర్య తేజ కాలుకు ఏప్రిల్ లో శస్త్ర చికిత్స చేయాల్సి ఉంది. శస్త్ర చికిత్స చేయాలంటే స్విమ్మింగ్ చేస్తే బాగుంటుందని డాక్టర్ సూచనతో..రోజు స్విమ్మింగ్‌కు వెళ్లేవాడు. రోజు మాదిరిగానే సాయి సూర్య తేజ ఈ నెల 7న తాను నివాసం ఉండే అపార్టుమెంట్ కింద ఉండే స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లాడు.
అయితే ప్రమాదవ శాత్తు స్విమ్మింగ్ పూల్‌లో పడి పోవడంతో ఆయన మృతి చెందాడు. తల్లిదండ్రులు కుమారుడి మరణ వార్త విని శోకసముద్రంలో మునిగిపోయారు. ఆస్టేలియాలో మృతి చెందిన సాయి సూర్య తేజ మృతదేహాం ఈ నెల 14, 15 తేదీల్లో నగరానికి చేరుకునే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు చేబుతున్నారు.