సిటీబ్యూరో, మే 3 (నమస్తే తెలంగాణ): ప్రముఖుల పేరుతో ఫోన్లు చేసి, నకిలీ లెటర్ హెడ్స్‌పై హెచ్‌సీఏ నుంచి ఐపీఎల్ మ్యాచ్ టిక్కెట్లు తీసుకొని వాటిని బ్లాక్‌లో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ముఠాను మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. హెచ్‌సీఏకు వస్తున్న ఫోన్లు, సిఫారస్ లేఖలపై అనుమానం వచ్చిన హెచ్‌సీఏ అధికారులు ఈ విషయాన్ని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమితి దృష్టికి తీసికెళ్లారు. నకిలీ ముఠాను పట్టుకోవడం కోసం ఆదివారం ప్రత్యేక బృం దాన్ని పోలీస్ కమిషనర్ రంగంలోకి దింపా రు.
ఉప్పల్ ప్రాంతంలో ఆదివారం జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఈ ము ఠా టిక్కెట్లను బ్లాక్‌లో విక్రయిస్తుంచేందుకు పక్కా ఫ్లాన్‌తో ఉన్నట్లు పోలీసులు గుర్తించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ముఠాలో ప్రధాన భూమిక పోషిస్తున్న అశోక్ అనే వ్యకితో పాటు మరో ఇద్దరిని ఎస్వోటీ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితులను తదుపరి విచారణ నిమిత్తం ఉప్పల్ పోలీసులకు అప్పగించారు.