సిటీ బ్యూరో, జనవరి 9 (నమస్తే తెలంగాణ): మెట్రో ఉద్యోగుల సర్వీస్‌ను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ పరిధిలో పనిచేస్తున్న అన్ని విభాగాలకు చెందిన 244 మంది సర్వీస్‌ను 2026 మార్చి 31 వరకు పొడిగిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు వెలువరించారు.
వీరి సేవలు 2025 మార్చి 31 నాటికి ముగియడంతో తాజాగా ఈ ఏడాది మార్చి వరకు పొడిగించారు.