సిటీబ్యూరో: దేశ వ్యాప్తంగా ఉన్న హోటల్స్ సర్వే చేసి వాటికి రేటింగ్ ఇస్తే రోజు భారీగా సంపాదించవచ్చని నమ్మించి ఓ వ్యాపారి నుంచి సైబర్‌నేరగాళ్లు రూ. 28 లక్షలు దోచుకున్నారు. సికింద్రాబాద్‌కు చెందిన బాధితుడికి వాట్సాప్‌లో సందేశం వచ్చింది. ఒక్కో సర్వే, రేటింగ్‌కు రూ. 100 ఇస్తారంటూ సందేశమున్నది. బాధితుడు 3 సర్వేలు చేయడంతో రూ. 300 అతడి బ్యాంకు ఖాతాలో జమయ్యాయి.
ఆ తరువాత ‘మీరు రూ. 2 వేలు పెట్టుబడి పెట్టండం’టూ నమ్మించి వెంటనే రూ. 2800 ఇచ్చారు. చివరకు రూ. 1,28,000 పెట్టుబడి పెట్టడంతో మోసం చేయడం మొదలుపెట్టారు. ‘మీరు పంపించిన డబ్బులో క్రిప్టోలో మార్చడంలో ఇబ్బంది అయ్యిందని, మరో టాస్క్ చేయాలంటూ సూచించారు. ఈ క్రమంలో 30 శాతం ఇన్‌కం ట్యాక్స్ చెల్లించాలంటూ నమ్మించి.. బాధితుడి వద్ద నుంచి దఫ దఫాలుగా రూ. 28.45 లక్షలు కాజేశారు.