సిటీబ్యూరో, మే 8 (నమస్తే తెలంగాణ): భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ మీదుగా ముంబై వెళ్తున్న కోణార్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు తనిఖీలు నిర్వహించా రు. ఈ తనిఖీల్లో 10కిలోల గంజాయి ని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే….భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్లే రైలులో గంజాయి రవాణా జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు గురువారం ఎస్టీఎఫ్ సీఐలు వెంకటేశ్వర్లు, నాగరాజులు..
సిబ్బందితో కలిసి కోణార్స్ ఎక్స్ ప్రెస్‌లో ఖాజీపేట నుంచి సికింద్రాబాద్ వరకు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో రైలులో అనుమానాస్పదంగా ఉన్న మూడు ప్యాకెట్లను తె రిచి చూడగా గంజాయి బయట పడిం ది. ఈ మొత్తం గంజాయి 10కిలోలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎస్టీఎఫ్ బృందాలు గంజాయిని స్వాధీనం చేసుకున్నాయి. తదుపరి విచారణ నిమిత్తం కేసును సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.
మరో కేసులో….
నారాయణగూడ, వైఎంసీఏ ప్రాంతా ల్లో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరిని ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 2.5కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే…నగరానికి చెందిన ఆటోడ్రైవర్ విక్కీ పటేల్ ధూల్‌పేట నుంచి గంజాయి కొనుగోలు చేసి నారాయణగూడ, వైఎంసీఏ ప్రాంతాల్లో విక్రయిస్తుంటాడు.
ఈ క్రమంలోనే విక్కీ పటేల్ గురువారం మధ్యాహ్నం ధూల్‌పేట నుంచి తీసుకువచ్చిన గంజాయిని నారాయణగూడ, వైఎంసీఏ ప్రాంతం లో మరో ఆటోడ్రైవర్ సుమంత్‌కు విక్రయిస్తుండగా సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ పోలీసులు వారిద్దరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు. వారి నుంచి 2.5కిలోల గంజాయితోపాటు రెండు ఆటోలు, మూడు సెల్ఫోన్లను సీజ్ చేశారు. కేసును తదుపరి విచారణ నిమిత్తం నారాయణగూడ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.
రహీంపురాలో…
ధూల్ పేటకు ఆనుకుని ఉన్న రహింపూరలోని ఒక ఇంట్లో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 1.518కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే…ధర్మసింగ్, మహేశ్‌సింగ్ , మనోజ్ సింగ్‌లు ధూల్‌పేటలోని ఇంట్లో గంజా యి విక్రయాలకు పాల్పడుతున్నారు. సమాచారం అందుకున్న ఆబ్కారీ పోలీసులు గురువారం వారి నివాసాలపై దా డులు జరిపి.. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి 1.518కిలోల గంజాయిని స్వాధీనం చేసున్నారు.
2.370 కిలోలు స్వాధీనం
పోచారం,మే 8: గంజాయి తరలిస్తున్న ఇద్దరిని ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 2.370 కిలోలను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సీఐ రవి వివరాల ప్రకారం.. బోడుప్పల్ డంపింగ్ యార్డు ఎదురుగా ఉన్న సబ్‌స్టేషన్ సమీపం నుంచి భాస్కర్‌రావు, బొంత సురేశ్‌లు యాక్టివాపై ఎండు గంజాయి తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా 2.370 కిలోల గంజాయి బయటపడింది. వెంటనే వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. దీనితో సంబంధం ఉన్న దినకర్, నానిలు పరారీలో ఉన్నారని తెలిపారు.