సిటీబ్యూరో, మే 15 (నమస్తే తెలంగాణ): నగరంలోని పలు చోట్ల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు జరిపారు. ఈ దా డుల్లో తొమ్మిది మందిని అరెస్ట్ చేసి, వా రి వద్ద నుంచి 5.515కిలోల గంజా యి, మూడు బైక్‌లు, 10సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్టీఎఫ్ ఈఎస్ అంజిరెడ్డి కథనం ప్రకారం …ధూల్‌పేట్ ప్రాంతానికి చెందిన బంగ్లావాల అజయ్ సింగ్ , జయశ్రీ బాయి, మీనాక్షిలు స్థానికంగా గంజాయి విక్రయిస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ పోలీసులు వారి నివాసాలపై దాడులు జరిపి.. ఆ ముగ్గురిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 3.209 కేజీల గంజాయితో పాటు ఒక ద్విచక్రవాహనంను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు.
మరో కేసులో 1.02 కేజీల గంజాయిని పట్టుకున్నారు.. బలంపేట్ సిద్ధార్థ సింహాద్రి సదన్ సమీపంలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ పోలీసులు స్థానిక ప్రాంతాల్లో దాడులు జరిపారు. ఈ దాడుల్లో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఎరసాని రాణి, చుక ఆనంద్ బాబులను అరెస్టు చేశా రు. పరారీలో ఉన్న మరో నిందితుడు చింతల దుర్గా ప్రసాద్‌పై కేసు నమోదు చేశారు. అలాగే.. బాలానగర్ వినాయకనగర్‌లో గంజాయి విక్రయిస్తున్న కటి క యోగేందర్, దేవరకొండ విశాల్, రితిక్లను అరెస్టు చేసి, 1.306కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.