హైదరాబాద్: హైదరాబాద్‌లో కొత్తరకం దందా వెలుగులోకి వచ్చింది. విస్కీని ఉపయోగించి ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1, 5 లోని అరికో ఐస్‌క్రీమ్ పార్లర్లలో ఎక్సైజ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విస్కీ కలిపి ఐస్‌క్రీమ్‌లను అమ్ముతున్నట్లు గుర్తించారు. అరికో పార్లర్ నిర్వాహకులు దయాకర్ రెడ్డి, శోభన్‌ను అదుపులోకి తీసుకున్నారు. 60 గ్రాముల ఐస్‌క్రీమ్‌లో 100 మిల్లీలీటర్ల విస్కీని కలుపుతున్నట్లు తేలింది.
టేస్ట్ బాగుండటంతో ఐస్‌క్రీమ్ క్రీమ్ విస్కీ కోసం పిల్లలు, యువత ఎగబడుతున్నారు. అమ్మకాలను మరింత పెంచుకునేందుకు మరో అడుగు ముందుకేసి నిర్వాహకులు.. ఫేస్ బుక్‌లో ఒక యాడ్ కూడా ఇచ్చారు. కాగా, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్టీఎఫ్ టీం లీడర్ ప్రదీప్ రావు నేతృత్వంలో సోదాలు నిర్వహించిన అధికారులు 11.5 కేజీల విస్కీ ఐస్‌క్రీమ్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.