బంజారాహిల్స్,ఫిబ్రవరి 24: తన స్నేహితులతో కలిసి పబ్‌లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న యువతిపై మాజీ ప్రియుడు దాడికి పాల్పడ్డ ఘటన జూబ్లీహిల్స్ పో లీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హఫీజ్‌బాబా నగర్‌కు చెందిన యువతి(25) కొంతకాలంగా క్రితం ఎండీ.అసఫ్జానీ అనే వ్యక్తితో ప్రేమలో ఉండేది. అయితే అతడి ప్రవర్తన నచ్చకపోవడంతో పాటు వేధింపులు ఎక్కువ కావడంతో ఇద్దరూ విడిపోయారు.
కాగా ఆదివారం రాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నెం 10 లోని ఇల్యూషన్ పబ్‌లో తన స్నేహితులతో కలిసి యువతి పార్టీ చేసుకునేందుకు వచ్చింది. ఆమెను వెంబడిస్తూ వచ్చిన అసఫ్ జానీ దురుసుగా ప్రవర్తించడంతో పాటు పార్కింగ్‌లో గొడవకు దిగాడు. తీవ్ర అభ్యంతరకరమైన బాషలో ఆమెను దూషించడంతో పాటు విచక్షణా రహితంగా కొట్లాడు. అడ్డుకునేందుకు యత్నించిన యువతి స్నేహితురాళ్లపై కూడా చేయి చేసుకున్నాడు. ఈ మేరకు యువతి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.