శంషాబాద్ రూరల్ : ప్రతి ఒక్కరు దైవభక్తిని అలవర్చుకోవాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ పిలుపునిచ్చారు. బుధవారం శంషాబాద్ మండలంలోని పాలమాకుల గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు ఆశోక్కుమార్గౌడ్, సునీల్‌గౌడ్ ఆధ్వర్యంలో నాగదేవతల దేవాలయం నిర్మాణం చేశారు.
నూతన విగ్రహాప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పాల్గొని అర్చకుల వేదమంత్రాల మద్య నాగదేవత విగ్రహాలను ప్రతిష్టించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరు దైవభక్తిని అలవర్చుకున్నపుడే తప్పదోవ పట్టకుండా భక్తిభావంతో నిండిపోతారన్నారు.
దేవాలయం నిర్మాణం చేసిన దాతలను అభినంధించారు. కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్‌లీడర్ నీరటి తన్విరాజు, ఎంపీపీ జయమ్మ, పీఏసీఎస్ చైర్మన్ శ్రావణ్‌గౌడ్, పార్టీ మండలాధ్యక్షుడు చంద్రారెడ్డి, మోహన్‌రావు, ఎంపీటీసీలు ఇందిరాదేవికృఫ్ణగౌడ్, సరీతరవీందర్,నాయకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.