శంషాబాద్ రూరల్, డిసెంబర్ 29: అందరూ భక్తిభావా న్ని అవర్చుకోవాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టీ.ప్రకాశ్ గౌడ్ అన్నారు. బుధవారం మండలంలోని చిన్న గో ల్కొండ గ్రామంలో సర్పంచ్ గుర్రం పద్మావతి, పీఏసీఎస్ డైరెక్టర్ గుర్రం అనంతరెడ్డి ఆధ్వర్యంలో రామాలయం, శివాలయ నిర్మాణాలకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాలయాలు నిర్మించడంతో ప్రజల్లో భక్తిభావం పెరుగుతుందన్నారు. యువత చేడు మార్గాల వైపు వెళ్లకుండా ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో దేవాలయాలు నిర్మించి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్, జడ్పీటీసీ నీరటి తన్విరాజు, వైస్ ఎంపీపీ నీలం మోహన్‌నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్‌గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కే.చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి మోహన్‌రావు, ఉప సర్పంచ్ భిక్షపతి, వార్డు సభ్యులు గౌతమ్‌బాబు, సారలక్ష్మి, రాఘవేందర్, మల్లేశ్, మాజీ సర్పంచ్ సారకృష్ణ, పార్టీ గ్రామ అధ్యక్షుడు సార జంగయ్య, వీరయ్య పాల్గొన్నారు.
ఫిలిప్పీన్స్‌లో ఎంబీబీఎస్.. మైలార్‌దేవ్‌పల్లిలో రెస్టారెంట్
మైలార్‌దేవ్‌పల్లి, డిసెంబర్29: డివిజన్లోని మధుబన్ కాలనీలో ఏర్పాటు చేసిన ఎల్లోక్యాబ్ బిర్యానీ రెస్టారెంట్‌ను ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ బుధవారం ప్రారంభించారు. పద్మశాలిపురం బస్తీకి చెందిన యువకులు రాజా, సాయికిరణ్ ఫిలిప్పీన్స్‌లో ఎంబీబీఎస్ చేస్తూ, ఆన్లైన్ క్లాసుల్లో పాల్గొంటూ వ్యాపారం చేయడంపై ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ప్రేమ్‌గౌడ్, యూత్ అధ్యక్షుడు రాఘవేందర్ యాదవ్, పి.కిరణ్, నాయకులు కాశిగారి యాదగిరి, మసున వెంకటేశ్, గంజి వెంకటేశ్, శ్రీను, డీవీ.కుమార్, ఎల్లప్ప, మహేశ్‌రాజ్, నాని పాల్గొన్నారు.