రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆరువారాల్లో మహిళలను, యువతులను వేధింపులకు పాల్పడిన 31 మందిని షీటీమ్స్ అరెస్ట్‌చేసి.. 36 కేసులను నమోదు చేసింది. వారికి శుక్రవారం ఎల్బీనగర్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కు టుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా షీటీమ్స్.. మరోసారి వారి జోలికి వెళ్లకుండా వా రిని మందలించింది. అమ్మాయిలను వేధించిన కేసులో చిక్కుకుంటే చట్టపరంగా కఠిన శిక్షలను ఎదుర్కోవాల్సి వ స్తుందన్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో వారు చేసిన తప్పులను వీడియో దృశ్యాలను చూపించారు. మరోసారి ఇలాంటి కేసుల్లో పట్టుబడకుండా కుటుంబ సభ్యు లు కూడా వారి పిల్లలకు సూచించాలని కోరారు. అదే విధం గా యాదాద్రి పోలీసు స్టేషన్ పరిధిలో బలవంతంగా జరుగుతున్న ఓ బాల్య వివాహాన్ని ఆపారు. దీంతో ఇప్పటి వరకు రాచకొండ పరిధిలో దాదాపు 95 బాల్య వివాహాలను షీ టీమ్స్ ఆపాయి. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ 34/7 అం దుబాటులో ఉంటుందని.. ఎవరూ కూడా అధైర్యపడకుం డా బాధిత మహిళలు షీ టీమ్స్‌ను ఆశ్రయించాలని సీపీ మహేశ్ భగవత్ కోరారు.