Bharat Brand | అబిడ్స్, మే 17: కేంద్ర ప్రభుత్వం దేశంలోని రేషన్ దుకాణాల ద్వారా భారత్ బ్రాండ్ నిత్యావసర సరుకులను విక్రయించేలా.. చర్యలు తీసుకోనున్నట్లు ప్రాథమికంగా నిర్ణయించినట్లు ఆలిండియా ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ ఫెడరేషన్ నేషన్ జనరల్ సెక్రటరీ బిశ్వంబర్ బసు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రేషన్ దుకాణాల అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ..
కేంద్ర ప్రభుత్వం భారత్ బ్రాండ్ ద్వారా నిత్యావసర వస్తువులను చౌకగా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా విక్రయాలు చేపట్టాలని నిర్ణయించిందన్నారు. అయితే సెంట్రల్ అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి బిశ్వంబర్ బసు ఆధ్వర్యంలో వీరి బృందం కేంద్ర ప్రభుత్వంతో చర్చించి రేషన్ దుకాణాల ద్వారా భారత్ బ్రాండ్ వస్తువులను విక్రయించేలా ఒప్పించడంలో సఫలీకృతులైనట్లు నగర నాయకులు నాయకోటి రాజు తెలిపారు.