సిటీబ్యూరో, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఆవిర్భావ దినం సందర్భంగా సోమవారం శేరిలింగంపల్లిలోని ఎల్లమ్మబండలో స్థానిక బీఆర్ఎస్ నాయకుడు ఎర్రబెల్లి సతీశ్ రావు ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి జాతీయ పతాకం ఎగురవేశారు.
తెలంగాణ సాధకుడైన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు ప్రకటిస్తూ ఆయన చిత్రపటానికి పాలతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రామ స్వామి, జీవన్ రెడ్డి, సమద్, జగదీశ్, రాజు, జనార్దన్ రావు, శ్రీనివాస్, రాము తదితరులు పాల్గొన్నారు.