మల్కాజిగిరి, ఫిబ్రవరి 25: పేద విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో చదువులు చెబుతున్నామని అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ శాంతిశ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ బాలకల స్కూల్లో కార్పొరేటర్, వెంకటాపురం డివిజన్లోని ప్రభుత్వ స్కూల్లో కార్పొరేటర్ సబితాకిశోర్ ‘మన బడి – మన బస్తీ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శాంతిశ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంలో చదువులు చెబుతున్నారన్నారు. విద్యార్థులకు ఉచితంగా టెక్ట్స్, నోట్ బుక్స్, యూనిఫాం, మధ్యాహ్న భోజనం అందజేస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ భావితరాల బిడ్డలను పోటీ ప్రపంచంలో రాణించడానికి ఇప్పటి నుంచి మెరుగైన విద్యను అందజేయడానికి కృషిచేస్తున్నారని తెలిపారు. ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు తీసుకుంటున్నారన్నారు. వచ్చిన ప్రతి విద్యార్థికి స్కూల్లో అడ్మిషన్ ఇస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు కంప్యూటర్ విద్యతో పాటు కౌన్సెలింగ్ ఇస్తున్నారన్నారు. కరోనా నేపథ్యంలో 15 ఏండ్ల విద్యార్థుకు టీకాలు ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సబితాకిశోర్, హెచ్ఎంలు సంధ్యారాణి, అంజనేయులు, నాయకులు అనిల్‌కిశోర్, పుదారి రాజేశ్ కన్న, నాగేశ్వరరావు, అరవింద్‌కుమార్, సంతోష్, మల్లేశ్‌గౌడ్, మనోజ్, శివ, ప్రభాకర్, మోసిన్, రాజు, నరేశ్, సురేశ్, జ్ఞాని, షేక్, సాబిర్, రమ పాల్గొన్నారు.