సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ) : ట్రై కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలో జరుగుతున్న నిర్వహణ, మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనుల టెండర్ల ప్రక్రియలో పలు జోన్ల ఇంజినీర్ల వ్యవహార శైలి తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది. ప్రభుత్వ నిబంధనలను తమదైన శైలిలో చుట్టేస్తూ.. కొందరు అధికారులు ఇష్టారాజ్యం వ్యవహరిస్తున్నారు. జీవో నంబరు 94, 66లకు సరికొత్త భాష్యం చెబుతూ అక్రమార్కులకు పెద్ద పీట వేస్తూ..వారి ఇచ్చే పర్సంటేజీలకు జీ హుజుర్ అంటూ పనుల పారదర్శకతకు పాతర వేస్తున్నారు.
కాంట్రాక్టర్ల అర్హతలు, ఆర్థిక టర్నోవర్, పనుల అనుభవానికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన అత్యంత కీలకమైన జీవో నం. 94, జీవో నం. 66లను సదరు అధికారులు తమకు అనుకూలంగా మలుచుకుని అనుకూల వ్యక్తులకే పనులు కట్టబెడుతున్నారు. ఇటీవల కాలంలో కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, మహేశ్వరం పరిధిలో గుర్రపు డెక్క పనులు, ఖైరతాబాద్‌లో వినాయక, దసరా ఉత్సవాల సందర్భంగా క్రేన్ల పనులు వివాదాస్పదం కాగా, తాజాగా గోల్కొండ, రాజేంద్రనగర్ బక్రీద్ నిర్వహణ టెండర్లలో అనుకూల వ్యక్తికే పనులు దక్కేలా టెండర్ నిబంధనలు మార్చారు.
ఒక్క వ్యక్తికి మాత్రమే సంబంధిత పనులు దక్కేలా టెండర్ పిలవడం, వివాదం కావడంతో అన్ని ఏజెన్సీలు టెండర్లో బక్రీద్ నిర్వహణ టెండర్లో పాల్గొనేలా తిరిగి టెండర్ పిలవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే కూకట్పల్లి జోన్లో రూ. 50 కోట్లతో దాదాపు 20 పనులకు టెండర్లకు పిలవగా, జీవో 66 ప్రకారం అందరికీ అవకాశం ఉంటుందని చెబుతూనే రెండు టెండర్లలో ఒకదాంట్లో తెరపైకి ఎంవోయూ నిబంధన చేర్చి అనుకూల ఏజెన్సీకి పనులు దక్కేలా మార్గం సుగమమం చేసిన తీరు కాంట్రాక్టర్లలో ఇప్పుడు హాట్ హాట్ చర్చకు దారి తీసింది.
సంబంధిత ఇంజినీర్ పనితీరుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నట్లు ప్రచారం సాగుతున్నది. నిబంధనల ప్రకారం పారదర్శకంగా సాగాల్సిన టెండర్ల కేటాయింపుల్లో ద్వంద్వ విధానాలు అవలంబిస్తూ, నగర అభివృద్ధిని సైతం పకనబెట్టి సొంత ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్న ఇంజినీర్లపై ట్రై కార్పొరేషన్ల కమిషనర్లు, విజిలెన్స్ విభాగం అధికారులు నిఘా పెట్టాలన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ని బంధనలకు తమకు నచ్చినట్లుగా సరికొత్త భాష్యాలు చెబుతూ..ప్రభుత్వ జీవోలను కొందరు ఇంజినీర్లు తుంగ లో తొకుతున్నారు. తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్టడమే లక్ష్యంగా తెరవెనుక చక్రం తిప్పుతుండటం ఇటు కార్పొరేషన్ వర్గాల్లో, అటు కాంట్రాక్టర్ల సరిళ్లలో తీవ్ర అరోపణలు ఎదుర్కొంటున్నారు.
ప్రధానంగా గోషామహల్, మల్కాజిగిరి, ఖైరతాబాద్ పరిధిలో చేసే ఇంజినీర్లు కాగా, ఎంఎంసీ, సీఎంసీ పరిధిలో కీలకమైన ఇంజినీర్లు కాంట్రాక్టర్లతో కుమ్మ క్కై అనుకూల కండిషన్లకు పనులను అప్పనంగా అప్పగిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. నిబంధనల ప్రకారం అర్హులైన వారికి దకాల్సిన పనులను, నిబంధనలను మెలికలు తిప్పి మరీ పకన పెడుతున్నారు. ఒకే రకమైన కాంట్రాక్టుకు ఒక డివిజన్లో ఒక రూల్, పక డివిజన్ లో మరో రూల్ వర్తింపజేస్తూ ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తున్నారు. అర్హతలు ఉన్నప్పటికీ తమకు ‘సహకరించని’ కాంట్రాక్టర్లను సాంకేతిక కారణాల సాకుతో తిరసరిస్తూ, అనుభవ శూన్యులైనా తమకు నచ్చిన వ్యక్తులకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గుర్రపు డెక్క, లేన్ మా ర్కింగ్, క్రీడా అభివృద్ధి, సీజనల్ వర్క్స్, బీటీ రోడ్లు, బ్యూటిఫికేషన్ పనుల్లో అనర్హులకు అందలం ఎక్కి స్తూ అందినంత దండుకుంటున్నారన్న ఫిర్యాదులు లేకపోలేదు.
గుర్రపు డెక్క పనులు, బిల్లుల మం జూరు చేతివాటం ప్రదర్శించిన కూకట్పల్లి ఎస్ఈ చిన్నారెడ్డి సైతం ఏసీబీకి పట్టుబడిన తీరు ఓ ఉదాహరణ అని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. రోడ్లపై లేన్ మార్కింగ్‌లో పాత ఎక్సీపీయన్స్ సర్టిఫికెట్లు అడగడం, గుర్రపు డెక్క తొలగింపు పనుల్లో సిమిలర్ నేచర్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ( ప్రత్యేక అనుభవం) అడగడం వంటి చేస్తూ అనుకూల వ్యక్తులకు టెండర్లలో పాల్గొ ని 0-1 శాతం కోడ్ చేసి పనులను దక్కించుకుంటూ ప్రభుత్వ ఖజానాకు నష్టం చేస్తున్నట్లు విమర్శలు ఉన్నా యి.
టెండర్లలో పోటీ లేకపోవడం వల్ల కార్పొరేషన్‌కు రావాల్సిన ప్రయోజనం దక్కకుండా పోతుందని, కొంద రు ఇంజినీర్ల సొంత లాభాల కోసం ప్రభుత్వ సొమ్మును దారి మళ్లిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన జీవో 66 స్ఫూర్తిని దెబ్బ తీస్తూ టెండర్లలో ఏకఛత్రాధిపత్యం నడుపుతున్న కొందరు ఇంజినీర్ల పనితీరుపై విజిలెన్స్ దృష్టి సారించాలన్న బాధిత కాంట్రాక్టర్లు కోరుతున్నారు.