దర్జాగా కబ్జా!
ఆల్విన్ కాలనీ శంషీగూడ పరిధిలో అంబీర్ చెరువు ప్రధాన తూమును ఓ బడా నిర్మాణ సంస్థ యథేచ్ఛగా కబ్జా చేసి.. ధ్వంసం చేస్తున్నది. అభివృద్ధి పేరుతో బడా భవనాల నిర్మాణానికి అడ్డుగా ఈ కాలువ వస్తుండటంతో తనకున్న ఆర్థిక, రాజకీయ పలుకుబడితో ఈ తతంగాన్ని నడిపిస్తున్నది. ఫలితంగా చెరువు తూము ద్వారా నీరు ముందుకు పారే దారి లేక కాలనీలకు ముంపు ముప్పు అనివార్యం కానున్నది.
- అంబీర్ చెరువు తూము కాలువ ఆక్రమణ
మియాపూర్: ఆల్విన్ కాలనీ శంషీగూడ పరిధిలో అంబీర్ చెరువు ప్రధాన తూమును ఓ బడా నిర్మాణ సంస్థ యథేచ్ఛగా కబ్జా చేసి.. ధ్వంసం చేస్తున్నది. అభివృద్ధి పేరుతో బడా భవనాల నిర్మాణానికి అడ్డుగా ఈ కాలువ వస్తుండటంతో తనకున్న ఆర్థిక, రాజకీయ పలుకుబడితో ఈ తతంగాన్ని నడిపిస్తున్నది. ఫలితంగా చెరువు తూము ద్వారా నీరు ముందుకు పారే దారి లేక కాలనీలకు ముంపు ముప్పు అనివార్యం కానున్నది. గతంలోనూ ఇదే తరహాలో స్థానికులు తూము కాలువను వ్యర్థాలతో నింపి కబ్జా చేసేందుకు యత్నించగా, ‘నమస్తే తెలంగాణ’ కథనాన్ని ప్రచురించడంతో రెవెన్యూ అధికారులు స్పందించి కబ్జాను అడ్డుకుని తూమును పునరుధ్ధరించారు.
ప్రస్తుతం అదే తూమును ఓ బడా నిర్మాణ సంస్థ కబ్జా చేసి ధ్వంసం చేస్తున్నా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు నోరు మెదపకపోతుండటం పలు అనుమానాలకు తావిస్తున్నది. కాగా, అంబీర్ చెరువు ప్రధాన తూము కాలువను సదరు నిర్మాణ సంస్థ ధ్వంసం చేసి.. కాలువ రాళ్ల తెట్టను సైతం పూర్తిగా పెకిలించింది. అదే స్థలంలో భారీ నివాస సముదాయాన్ని నిర్మించేందుకు తమకు అడ్డుగా ఉన్న కాలువను ఆనవాళ్లు లేకుండా చేసింది. ఫలితంగా అంబీర్ చెరువు నుంచి ఎల్లమ్మ చెరువుకు గొలుసుకట్టు కాలువ పూర్తిగా కబ్జాకు గురై నీటి ప్రవాహానికి దారి లేకుండా పోయింది. ఈ విషయమై కూకట్పల్లి తహసీల్దార్, ఇరిగేషన్ ఏఈలను నమస్తే ప్రతినిధి సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

