సిటీబ్యూరో, జూలై 15(నమస్తే తెలంగాణ): విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణే ధ్యే యంగా జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాల లు, కళాశాలలు, వసతి గృహాలు, కిచెన్ గార్డెన్, టెర్రస్ గార్డెన్స్ ఏర్పాటుకు సంబంధిత శాఖల నుంచి నివేదికలు అందించాలని కలెక్టర్ హరిచందన దాసరి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ అధికారి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పైలెట్ ప్రాజెక్టు కింద షేక్‌పేట సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నత పాఠశాల, ములుగనూర్ పాఠశాలల్లో సంకల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా సేంద్రియ పంటలు పండించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు. సేంద్రియ పంట సాగుపై ఎన్జీవో ద్వారా ప్రాజెక్ట్ డైరెక్టర్ వెల్లూరి శ్రీనివాసన్, రామలింగారెడ్డి అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ అధికారులు ఆశన్న, కోటాజీ, ప్రవీణ్ రెడ్డి, ఇలియాస్ అహ్మద్, సంకల్ప్ ఫౌండేషన్ ఎన్జీవో రోజీ, ఆర్సీవోలు, ప్రిన్సిపాల్స్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
విద్యార్థులకు చదువుతోపాటు క్రీడల్లో శిక్షణనిస్తూ బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని, క్రీడల్లో ప్రత్యేక తర్ఫీదునిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దాలని కలెక్టర్ హరిచందన దాసరి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని గిరిజన సంక్షేమ శాఖ వాటర్ స్పోర్ట్స్ అకాడమీ, ఆశ్రమ హైస్కూ ల్ను సందర్శించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తరగతి గదుల్లో ‘యూ’ ఆకారంలో బెంచీలను ఏర్పాటు చేసి మెరుగైన బోధ న అందేలా చూడాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. 6 నుంచి 10 వ తరగతి గదులను సందర్శించి డిజిటల్ క్లాసుల్లో టీశాట్ ద్వా రా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కోటా జీ, ప్రిన్సిపాల్ అముక్తమాల్యద, వార్డెన్ నీలిమ, ప్రధానోపాధ్యాయుడు లాల్, ఉపాధ్యాయులు, స్పోర్ట్స్ టీచర్ భూపాల్ తదితరులు పాల్గొన్నారు.