మొయినాబాద్, మే3: మారుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూనే విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని జేపీ మోర్గాన్ కంపెనీ ఉపాధ్యక్షుడు మారియో డేవిడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్‌నగర్ గ్రామ రెవెన్యూలో గల కేఎల్ హైదరాబాద్ యూనివర్సిటీలో శనివారం రాత్రి ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ప్లేస్మెంట్ సక్సెస్ మీట్లో ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు పొందిన విద్యార్థులకు ఆయా కంపెనీల ప్రతినిధులు ప్రశంసాపత్రాలను, మెడల్స్‌ను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న విఫ్లవాత్మక మార్పులను పసిగడుతూ సంపూర్ణ నైపుణ్యాన్ని పెంచుకుంటే మెరుగైన ఉపాధి అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుందన్నారు.
సాంకేతిక నైపుణ్యాన్ని పెంచుకుంటే విద్యార్థులకు ఉజ్వల భవిషత్ ఉంటుందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిలో అనేక సవాళ్లు ఎదురవుతాయని వాటిపై నిరంతరం పరిశోధనలు చేస్తూ సవాళ్లను అధిగమించడం జరుగుతుందని తెలిపారు. అంతర్జాతీయ కార్పొరేట్ కంపెనీలు తమ పరిధిని విస్తరిస్తున్నాయని . భవిషత్ కోసం ఇంజినీరింగ్ విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లే విద్యార్థులకు ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుందన్నారు.
పారిశ్రామిక అనుబంధ శిక్షణలు : డైరెక్టర్ ఆకెళ్ల రామకృష్ణ
కేఎల్ హెచ్ యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు పారిశ్రామిక అనుబంధ శిక్షణలు ఇచ్చి వారిని ఎంతో నైపుణ్యం గల విద్యార్థులుగా తయారు చేసి వారికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కృషి చేస్తున్నామని కేఎల్‌హెచ్ యూనివర్సిటీ డైరెక్టర్ ఆకెళ్ల రామకృష్ణ అన్నారు. విద్యార్థుల్లో అనేక రకాలైన నైపుణ్యాలను పెంచడంలో యూనివర్సిటీ ఎంతో కృషి చేస్తుందని చెప్పారు.
విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపేలా విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని తెలిపారు. కేఎల్ విద్యా సంస్థలో చదివే ప్రతి ఒక్క విద్యార్థికి క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రౌనింగ్ ప్రోగ్రాం కింద ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని , తద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందిస్తూ వారిని అత్యుత్తమ ప్యాకేజీలు పొందేలా ప్రణాళిక అమలు చేస్తున్నామని తెలిపారు.
విద్యార్థులకు అద్భుత ప్యాకేజీలు: యూనివర్సిటీ వీసీ డాక్టర్ సారధివర్మ
కేఎల్‌హెచ్ యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు పొందే అవకాశం రావడంతో పాటు అద్భుతమైన ప్యాకేజీలు లభిస్తున్నాయని కేఎల్ హైదరాబాద్ యూనివర్సీటీ ఉపకులపతి డాక్టర్ సారధివర్మ అన్నారు. యూనివర్సిటీలో విద్యను అభ్యసించిన ఓ విద్యార్థికి ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలో ఉద్యోగ అవకాశం రావడంతో పాటు ఏడాదికి రూ. 75 లక్షల ప్యాకేజీ రావడం చాలా గర్వంగా ఉందని తెలిపారు. రూ.20 లక్షల నుంచి రూ. 50 లక్షల రూపాయల లోపు వార్షిక ప్యాకేజీలతో సూపర్ డ్రీమ్, డ్రీమ్ కంపెనీలలో తమ విద్యార్థులకు ప్లేస్మెంట్ పొందారని చెప్పారు. ఈ ఏడాది జర్మనీ, జపాన్, సింగాపూర్, దుబాయ్, మలేషియా వంటి దేశాల్లో అంతర్జాతీయ స్లేస్మెంట్స్ దర్కించుకోవడం జరిగిందని తెలిపారు. కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు తమ 3వ సంవత్సరంలోనే జాతీయ, అంతర్జాతీయ కంపెనీలలో ఇంటర్నషిప్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది 5 వందలకు పైగా కంపెనీలు యూనివర్సిటీకి వచ్చి విద్యార్థులకు ఇంటర్వ్యూలు చేశారని తెలిపారు.