SPDCL | సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ శాఖ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ల బదిలీలు చేపట్టింది. పది సర్కిళ్లలో ఇప్పటికే హబ్సిగూడ ఎస్ఈగా కొద్ది రోజుల కిందట బ్రహ్మం బదిలీ అయ్యారు. తాజాగా శనివారం 9 సర్కిళ్లలో పనిచేస్తున్న ఎస్ఈలను బదిలీ చేస్తూ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ ఆదేశాలు జారీ చేశారు.
సైబర్ సిటీ సర్కిల్ ఎస్ఈగా చంద్రశేఖర్, రాజేంద్రనగర్ సర్కిల్ ఎస్ఈగా డీఎస్ మోహన్, మేడ్చల్ సర్కిల్ ఎస్ఈగా ఎం.రవికుమార్, హైదరాబాద్ సౌత్ సర్కిల్ ఎస్ఈగా సోమిరెడ్డి, సరూర్‌నగర్ సర్కిల్ ఎస్ఈగా మాధవరెడ్డి, సికింద్రాబాద్ సర్కిల్ ఎస్ఈగా ఎల్. గోపయ్య, బంజారాహిల్స్ సర్కిల్ ఎస్ఈగా కరుణాకర్ బాబు, హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్ ఎస్ఈగా వెంకన్న, సంగారెడ్డి సర్కిల్ ఎస్ఈగా శ్రీనాథ్‌ను బదిలీ చేస్తూ సీఎండీ ఆదేశాలు జారీ చేశారు.