బేగంపేట, ఆగస్టు 3: ఓలా ఎలక్ట్రిక్ బైక్‌ల్లో అనేక సాంకేతిక లోపాలు తలెత్తి నష్టపోతున్నామంటూ బాధితులు శనివారం బేగంపేటలోని ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూం ఎదుట ఆందోళనకు దిగారు. ‘ఓలాకు హఠావో.. జాన్‌కు బచావో’ అంటూ నినాదాలు చేశారు. ఓలా బైక్‌లు కొనుగోలు చేసిన బోయినపల్లికి చెందిన ఈశ్వర్‌తో పాటు మరికొందరు బాధితులు బైక్‌ల్లో చాలా వరకు సాఫ్ట్వేర్ సమస్యలు వస్తున్నాయంటూ.. షోరూం నిర్వాహకులు, కంపెనీ యజమానులకు అనేకసార్లు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
అయినా యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నదని ఆరోపించారు. అలాగే సర్వీస్, మాన్యుఫాక్చరింగ్ సమస్యలు కూడా అధికంగా ఉన్నాయన్నారు. బైక్‌లు రన్నింగ్‌లో ఆగిపోతున్నాయని, ట్రాఫిక్‌లో ప్రాణాల మీదకు వచ్చిన ఘటనలు అనేకం ఉన్నాయని చెప్పినా.. పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక మంది గాయాల పాలైనట్టు బాధితులు వివరించారు.