గోల్నాక, జనవరి 7: మద్యం మత్తులో జారిపడి ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం..రామంతాపూర్ గోకులేనగర్కు చెందిన కృష్ణమూర్తి వేదరమణ అలియాస్ శ్రీధర్ (62) మద్యానికి బానిసగా మారి నిత్యం మద్యం సేవిస్తుంటాడు.
కాగా, గత మంగళవారం రాత్రి బాగ్‌అంబర్‌పేట ఎరకుల బస్తీలోని తెలిసిన వారింటికని వెళ్లి భవనం మెట్లు ఎక్కే క్రమంలో మద్యం మత్తులో ప్రమాదవశాత్తు జారి పడి తీవ్రగాయాలు కాగా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కూతురు ధర్మపురి శారద ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.