సిటీబ్యూరో, జూన్ 24(నమస్తే తెలంగాణ): రవీంద్రభారతిలోని పర్యాటక శాఖ కార్యాలయంలో నూతన డైరెక్టర్గా ఇలా త్రిపాఠి బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఆమెకు టూరిజం శాఖ ఉద్యోగులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. అనంతరం రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పలు కార్యాచరణలను అమలు చేస్తామని స్పష్టం చేశారు.