సిటీబ్యూరో, మే 7(నమస్తే తెలంగాణ): ఉద్యోగాల కోసం వెతుక్కోవాల్సిన పనిలేదు. విద్యార్హతకు తగ్గట్టుగా ఉద్యోగాలు, అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగ సమాచారం అందించడంతో పాటు ఉపాధి చూపించేందుకు ‘ఈజీ యాక్ట్’ స్టార్టప్ పనిచేస్తున్నది. ఐటీ, ఫార్మా, ఇండస్ట్రి రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీలతో అనుసంధానంగా ఉద్యోగాలు కల్పిస్తున్నది. ఒక్క హైదరాబాద్‌లోనే కాదు బెంగళూరు, ముంబై, చెన్నై తదితర నగరాల్లో కూడా ఉద్యోగ ఖాళీల వివరాలు చూపుతూ.. అందుకు కావాల్సిన నైపుణ్యంపై శిక్షణ ఇస్తూ నిరుద్యోగులకు భరోసానిస్తున్నది. తొలుత ఈ స్టార్టప్‌ను కొండాపూర్‌లో మొదలుపెట్టి, సేవలు విస్తరించడంలో భాగంగా మాదాపూర్‌లో కూడా రెండో శాఖను ఏర్పాటు చేశారు. ఉద్యోగాల కోసం అన్వేషించే వారి బాధలను దృష్టిలో ఉంచుకుని సులభతరంగా వారు లక్ష్యాలను చేరేందుకు ఈజీ యాక్ట్ స్టార్టప్‌ను ప్రారంభించామని ఫౌండర్ దినే మురుగేషన్ తెలిపారు. కాగా, ‘ఈజీ యాక్ట్’ జాబితాలో 2 లక్షల ఉద్యోగ వివరాలు ఉన్నాయి.