కందుకూరు, జూన్ 24: నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషిచేస్తున్నామని ఎమ్మెల్యే సబితారెడ్డి తెలిపారు. మంగళవారం మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ సామ ప్రకాష్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి సామ మహేందర్ రెడ్డి, పార్టీ మండల సోషల్ మీడియా కన్వీనర్ బొక్క దీక్షిత్‌రెడ్డి జిల్లెలగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సబితారెడ్డిని కలిసి కొత్తగూడ గ్రామం, మండల కేంద్రంలో నెలకొన్న సమస్యలపైన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ.. కొత్తగూడ గ్రామ పంచాయతీ పరిధిలో నూతనంగా ఏర్పాటువుతున్న కాలనీల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
నియోజకవర్గ పరిధిలోని సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. అనంతరం బాచుపల్లి గ్రామానికి చెందిన జంగయ్యకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన రూ.33 వేల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు దువ్వాసి నర్సింహ, తాజా మాజీ సర్పంచ్ యాలాల శ్రీనివాస్, తాజా మాజీ ఎక్స్ ఎంపీటీసీ సురేష్, బాచుపల్లి గ్రామ యూత్ అధ్యక్షుడు నరేష్, ఉపాధ్యక్షుడు రాజు, ప్రతాపరెడ్డి, రాములు, లక్ష్మయ్య, ఆగమయ్య, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.