చర్లపల్లి ( హైదరాబాద్ ) : ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని కాలనీల సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ( MLA Laxma reddy ) పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని శివసాయినగర్‌లో నూతన కాలనీ సంక్షేమ సంఘం ప్రమాణస్వీకారోత్సవం అనంతరం ఆయన మాట్లాడారు. కాలనీవాసుల భాగస్వామ్యంతో ఆదర్శ నియోజకవర్గంగా (Model constituency) తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటానని వెల్లడించారు.
కాలనీలల్లో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కాలనీవాసులు సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, కార్పొరేటర్లు పన్నాల దేవేందర్‌రెడ్డి, ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్లు కాలనీ అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.