బాలానగర్, నవంబర్ 25 : ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్‌ను గోల్డ్బోయిన్పల్లి దిశగా మార్చడం కోసం ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్లో ప్రజల సౌకర్యార్థం అనేక అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ప్రజల అవసరాలు, ప్రధాన్యతలు బట్టి పనులు చేపట్టి సకాలంలో పనులు పూర్తి చేయడంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ నర్సింహయాదవ్‌తో పాటు అధికారులు నిమగ్నమయ్యారు.
ఈ నేపథ్యంలోనే ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో భూగర్భ డ్రైనేజీ పనులు సైతం పూర్తి చేశారు. డివిజన్ ప్రజలకు రహదారి వ్యవస్థను మెరుగుపరచడం కోసం పలు బస్తీలు, కాలనీలలో రూ.3.కోట్ల 32 లక్షల 50వేల నిధులతో సీసీరోడ్డు పనులను సైతం చేపట్టారు. ప్రస్తుతం ఆయా పనులలో కొన్ని ఇటీవల పూర్తిచేయగా మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి.
హస్మత్‌పేట దుబాయ్గేట్ రోడ్డులో సీసీరోడ్డు పనులకు రూ.43 లక్షలు, మల్లికార్జునకాలనీ రోడ్డు నంబర్ 3లో సీసీరోడ్డు పనులకు రూ.68 లక్షలు, శాంతినికేతన్కాలనీలో సీసీరోడ్డు పనులకు రూ.48 లక్షలు, కోయబస్తీలో సీసీరోడ్డు పనులకు రూ.12 లక్షలు, లక్ష్మినర్సింహకాలనీలో సీసీరోడ్డు పనులకు రూ.12 లక్షలు, రాంరాజ్కాలనీ హైటెక్ స్కూల్ ఎదురు రోడ్డులో సీసీరోడ్డు పనులకు రూ.13.5 లక్షలు, ఆర్‌ఆర్‌నగర్‌లో రోడ్ నంబర్ 11లో సీసీరోడ్డు పనులకు రూ. 43 లక్షలు, 4 అంతర్గత సీసీరోడ్లకు రూ. 40 లక్షలు, అలీ కాంప్లెక్స్ వద్ద సీసీరోడ్డు పనులకు రూ. 50 లక్షలు కేటాయించి చేపట్టిన పనులు కొని పూర్తి కాగా మరికొన్ని పూర్తి కావస్తున్నాయి. ఆయా సీసీరోడ్డు పనులను త్వరలో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయడానికి అధికారులు ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు.
గోల్డ్బోయిన్పల్లిగా తీర్చిదిద్దుతాం..
ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్లో ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. డివిజన్ ప్రజల అవసరాల మేరకు ఆలోచన చేస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నాం. చేపట్టిన పనులలో ప్రధాన్యతను బట్టి ఆయా కాలనీలో పనులు చేపట్టి పూర్తి చేస్తున్నాం. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నాం, విద్యుత్ బకాయి సైతం సొంత నిధులతో చెల్లించడం జరిగింది. భూగర్భ డ్రైనేజీ, తాగునీరు, శ్మశాన వాటికల అభివృద్ధి, చెరువుకట్టపై వంతెన నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేయడం జరిగింది.
– ముద్దం నర్సింహ యాదవ్, ఓల్డ్‌బోయిన్‌పల్లి కార్పొరేటర్
నాణ్యతతో అభివృద్ధి పనులు
ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్ పరిదిలో ఇటీవల కాలంలోనే రూ.3 కోట్లకు పైగా నిధులు వెచ్చించి సీసీరోడ్డు పనులు చేపట్టడం జరిగింది. ఆయా పనులలో కొన్ని పూర్తయ్యాయి, మరికొన్ని పూర్తి కావస్తున్నాయి. సీసీరోడ్డు పనులను నాణ్యత ప్రమాణాలు పాటించేలా కృషి చేస్తున్నాం. అలీకాంప్లెక్స్ వద్ద చేపట్టిన రోడ్డు రెండు రోజులలో పూర్తి చేస్తాం. ఆర్‌ఆర్‌నగర్‌లో సైతం అంతర్గత సీసీరోడ్లు త్వరలో పూర్తి చేస్తాం.
– అరవింద్‌రావు, ఏఈ ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్