సిటీబ్యూరో, జూలై 4 (నమస్తే తెలంగాణ): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన శనివారం ఉన్నతాధికారులతో కలిసి పర్వత్ నగర్లో ఆధునిక మెకనైజ్డ్ రోడ్ స్వీపింగ్ యంత్రాల ప్రత్యక్ష ప్రదర్శనను పరిశీలించారు. అంతర్గత రహదారులు, కాలనీలకు సెల్ఫ్-ప్రొఫైల్డ్ స్వీపింగ్ మెషిన్, ప్రధాన రహదారులపై దుమ్ము, వ్యర్థాలను యాంత్రికంగా శుభ్రం చేసే ట్రక్ మౌంటెడ్ వ్యాక్యూమ్ కమ్ స్వీపింగ్ మెషిన్, సేకరించిన వ్యర్థాల రవాణాకు వ్యర్థాల సేకరణ వాహనం పనితీరును పరిశీలించారు.
ఫైలెట్ ప్రాజెక్టులో భాగంగా రెండు ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ స్వీపింగ్ యంత్రాలను క్షేత్రస్థాయిలో వినియోగిస్తూ వాటి పనితీరు, సా మర్థ్యం అధికారులను నుంచి అడిగి తెలుసుకున్నారు. రహదారుల పరిశుభ్రతను మెరుగు పరచడం, పారిశుధ్యం సేవలను సమర్థవంతంగా అందించడానికి ఈ పైలెట్ అధ్యయనం ఉపయోగపడుతుందని తెలిపారు.