ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
బంజారాహిల్స్, జూలై 13 : మానవజాతి సంపూర్ణ వికాసానికి విద్యే మూలమని, ఇలాంటి పరిస్థితుల్లో విద్యను వ్యాపారంలా చూస్తున్న ఆలోచనా ధోరణిలో మార్పు రావాల్సిన అవసరం ఉన్నదని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు.
గురు పూర్ణిమ సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని మానవ వనరుల అభివృద్ధి సంస్థలో దాశరథి కళా వేదికలో ఆకృతి సంస్థ ఆధ్వర్యంలో పెంటమరాజు, సుశీలా రంగారావు పేరిట ఏర్పాటు చేసిన సంస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రముఖ ప్రవచన కారుడు గరికపాటి నరసింహారావుకు ‘సంసార్’ అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ఫికీ సీఎండీ అచ్యుత జగదీశ్ చంద్ర, ఆకృతి సంస్థ అధ్యక్షుడు సుధాకర్ రావు, తదితరులు పాల్గొన్నారు.