ఖైరతాబాద్, సెప్టెంబర్ 12 : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో తెలంగాణలో విద్యా, వైద్యశాలలు, విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలని ఖైరతాబాద్కు చెందిన టీఆర్ఎస్ నాయకులు కేవీ ప్రసాద్, కర్నాటి నాగేశ్వర్ రావులు చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని కోరారు.
టీటీడీ చైర్మన్గా రెండో సారి ఎన్నికైన సందర్భంగా నగరంలోని ఆయన నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు.
టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న దేవాలయాల్లో అత్యాధునిక సౌకర్యాలు కల్పించాలని, లడ్డూ, దర్శనం టికెట్ల కౌంటర్ల వ్యవస్థ ఏర్పాటు, గోశాలను అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా ఆయనను కోరారు. వారి వెంట రాకేశ్, నాగిరెడ్డి, నరేశ్ తదితరులు ఉన్నారు.