కొత్త ఓటర్లకు కష్టాలు.. ఇష్టారాజ్యంగా ఫారం-6 తిరస్కరణ
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రకియ (సర్)లో భాగంగా ఎన్నికల సంఘం అధికారులు తీసుకుంటున్న వరుస నిర్ణయాలు, మారుస్తున్న నిబంధనలు వేలాది మంది కొత్త ఓటర్ల పాలిట శాపంగా మారాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక నిశిత సవరణ ప్రక్రియ వేళ నిబంధనల పేరుతో ఈసీఐ వ్యవహరించిన తీరు కారణంగా వేలాది మంది పౌరుల కొత్త ఓటు నమోదు దరఖాస్తులు దారుణంగా తిరసరణకు గురయ్యాయి.
- ఫారం- 6,7 అంటే?
- మూడు జిల్లాల పరిధిలో 1, 65, 821 దరఖాస్తులు..
- ఫారం-7 కింద 7,298 తొలగింపులు
- ఓటర్ల జాబితాలో ప్రక్రియ లోపాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రకియ (సర్)లో భాగంగా ఎన్నికల సంఘం అధికారులు తీసుకుంటున్న వరుస నిర్ణయాలు, మారుస్తున్న నిబంధనలు వేలాది మంది కొత్త ఓటర్ల పాలిట శాపంగా మారాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక నిశిత సవరణ ప్రక్రియ వేళ నిబంధనల పేరుతో ఈసీఐ వ్యవహరించిన తీరు కారణంగా వేలాది మంది పౌరుల కొత్త ఓటు నమోదు దరఖాస్తులు దారుణంగా తిరసరణకు గురయ్యాయి. సవరణ ప్రక్రియ ప్రారంభానికి ముందే (జనవరి 1, 2026 నుంచి జూన్ 14, 2026 వరకు) కొత్త ఓటు నమోదు కోసం ఫారం-6 ద్వారా దాఖలైన దరఖాస్తులు వేలల్లో వచ్చాయి. ఆ సమయంలో అసలు డిక్లరేషన్ ఫారం నిబంధనే అమల్లో లేదు. కానీ, తర్వాతి కాలంలో ప్రారంభమైన సర్ ప్రక్రియ కోసం 2002 ఓటర్ల వివరాలు, లేదా 12 రకాల పౌరసత్వ ఆధారాల నమోదును తప్పనిసరి చేస్తూ డిక్లరేషన్ ఫారాన్ని ఎన్నికల సంఘం తీసుకొచ్చింది. ఈ ప్రక్రియ లేని రాష్ట్రాల్లో డిక్లరేషన్ అవసరం లేదని ఈసీ ఇటీవల స్పష్టం చేసినప్పటికీ.. అప్పటికే కొన్ని ప్రాంతాల్లో జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
– సిటీబ్యూరో, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ)
ఫారం-6 ద్వారా కొత్త ఓటరు నమోదుకు అవకాశం ఉంది. 18 ఏళ్లు నిండిన అర్హులైన యువత మొదటిసారి ఓటరుగా నమోదు చేసుకోవడానికి, లేదా ఇప్పటివరకు ఓటు హకు లేనివారు తమ పేరును ఓటర్ల జాబితాలో చేర్చుకోవడానికి ఫారం-6ని ఉపయోగిస్తారు. ఇక ఫారం-7 ద్వారా పేర్ల తొలగింపు, అభ్యంతరాలు తెలపవచ్చు. ఓటర్ల జాబితాలో లేని లేదా అనర్హులైన వారి పేర్లను తొలగించడానికి, లేదా ఏదైనా పేరు నమోదుపై అభ్యంతరం వ్యక్తం చేయడానికి ఫారం-7 ఉపయోగిస్తారు. ఓటరు మరణించినప్పుడు, ఓటరు నివాస ప్రాంతాన్ని శాశ్వతంగా వేరే చోటికి మార్చినప్పుడు, ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు హక్కు నమోదు అయినప్పుడు, వయస్సు నిండకుండానే తప్పుడు వివరాలతో ఓటు పొందినప్పుడు తదితర అంశాలపై తొలగింపు, అభ్యంతరాలుంటాయి. కాగా, గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 5తో ముగియవలసిన నోటీసుల జారీ, అభ్యంతరాలు, వినతుల పరిషార గడువును నవంబర్ 26, 2026 వరకు పొడిగించారు. అలాగే, నవంబర్ 9న విడుదల కావాల్సిన తుది ఓటరు జాబితా ప్రచురణ తేదీని నవంబర్ 30, 2026కి మార్చడంతో మరిన్ని రోజులు గందరగోళంలో ఓటర్లు ఉండనున్నారు.
సిటీబ్యూరో, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) కార్యాలయ లెకల ప్రకారమే రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు కాలంలో వచ్చిన మొత్తం 5,20,331 ఫారం-6 దరఖాస్తుల్లో అక్టోబర్ 28 నాటికి కేవలం 3,22,785 మాత్రమే ఆమోదం పొందాయి. డిక్లరేషన్ ఫారం సమర్పించలేదన్న నిబంధనను సాకుగా చూపి ఏకంగా 1,92,574 దరఖాస్తులను (ఏకంగా 37 శాతం) అధికారులు తిరసరించారు. ఇంకా 4,972 దరఖాస్తులు పెండింగ్‌లోనే మూలుగుతున్నాయి.
ఎక్కువగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోనే తిరస్కరణకు గురైనట్లు తెలుస్తోంది. కొత్తగా దరఖాస్తు చేసుకుంటే తప్ప..వీరి పేర్లు తుది ఓటర్ల జాబితాలో చేరవని అధికారులు చేతులెత్తేస్తున్నారు. కాగా, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్ (1960) ప్రకారం.. అందిన దరఖాస్తులను ఈఆర్ఓ కార్యాలయం నోటీసు బోర్డులో ఉంచి వారం రోజుల్లోగా పరిషరించాలి. కానీ జూన్ 14 వరకు అందిన ఫారంలను సకాలంలో పరిషరించకుండా, ఇప్పుడు ఎన్యూమరేషన్, క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ దశలతో కలిపి మరీ సాగదీస్తున్నారు. ప్రస్తుతం ఈ దరఖాస్తుల క్లియరెన్స్ కోసం ఈఆర్ఓలు తలుపు తట్టి బీఎల్ఓల ద్వారా డిక్లరేషన్లు సేకరింపజేస్తున్న తీరు వారి పనితీరులోని వైఫల్యాన్నే ఎత్తిచూపుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో పని మనుషుల అభిప్రాయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.
అంతా గందరగోళం
ఫారం-6 ద్వారా కొత్త ఓటరు నమోదులో భాగంగా ఈ ఏడాది జనవరి 1 నుంచి అక్టోబరు 27 వరకు దరఖాస్తుల వివరాలను పరిశీలిస్తే హైదరాబాద్ జిల్లాలో 4,22, 862 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో 3, 15, 725 మంది దరఖాస్తులను ఆమోదించారు. 86, 667 దరఖాస్తులను తిరస్కరించారు. 20,470 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 1,66, 469 దరఖాస్తులు చేసుకుంటే ఇందులో 1,05,436 దరఖాస్తులను ఆమోదించారు. 49,093 దరఖాస్తులను తిరస్కరించారు. 11,930 పెండింగ్‌లో ఉన్నాయి. మేడ్చల్ జిల్లాలో 1,21,247 మంది దరఖాస్తులు స్వీకరించగా..68, 789 దరఖాస్తులను ఆమోదించారు. 30,061 దరఖాస్తులను తిరస్కరించారు. 22, 397 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి.
మూడు జిల్లాల పరిధిలో 1, 65, 821 దరఖాస్తులను తిరస్కరించారు. ఫారం-7 ద్వారా పేర్ల తొలగింపు , అభ్యంతరాలలో భాగంగా హైదరాబాద్ జిల్లాలో 1, 09, 651 దరఖాస్తులు స్వీకరిస్తే…1,01,288 దరఖాస్తులను ఆమోదించారు. 4,808 దరఖాస్తులను తొలగించారు. 3555 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 52, 674 దరఖాస్తులను స్వీకరించగా….49,475 దరఖాస్తులను ఆమోదించారు. 1972 దరఖాస్తులను తొలగించారు. 1227 దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టారు. మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలో 33 488 దరఖాస్తులను స్వీకరిస్తే ..31,349 దరఖాస్తులను ఆమోదించారు. 518 దరఖాస్తులను తొలగించారు. 1621 దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంది. 7298 దరఖాస్తులను తొలగించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

