Gongidi Sunitha | గ్లోబల్ సమ్మిట్‌తో ఒరిగిందేమిటో సమగ్ర నివేదిక విడుదల చేయాలి : మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత
Gongidi Sunitha | అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ కోసం సుమారు రూ.50 కోట్లు ఖర్చు చేయడంపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.
యాదాద్రి భువనగిరి : తెలంగాణ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నా, సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పదేపదే చెబుతున్నారని మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ( Gongidi Sunitha ) అన్నారు. అలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ( Global Summit ) కోసం సుమారు రూ.50 కోట్లు ఖర్చు చేయడంపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని పరిస్థితి లేదన్నారు. సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలు కాని సమయంలో ప్రజాధనంతో అంతర్జాతీయ సదస్సు నిర్వహించడం వల్ల రాష్ట్ర ప్రజలకు కలిగిన ప్రయోజనాలేమిటని ప్రశ్నించారు. ఈ సదస్సు ద్వారా ఎన్ని దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు? ఎన్ని పెట్టుబడులు వచ్చాయి? ఎన్ని పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి? ఎంతమందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి? అనే వివరాలను ప్రభుత్వం సమగ్ర నివేదిక రూపంలో ప్రజల ముందు ఉంచాలని కోరారు.
అంతర్జాతీయ సదస్సు అంటే వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు వేదికపై ఉంటారని భావించామన్నారు. అయితే వేదికపై రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ఏఐసీసీ నాయకులే కనిపించడం గమనించాల్సిన అంశమన్నారు. ఈ నేపథ్యంలో సదస్సు నిర్వహణ కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసమేనన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోందని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gongidi Sunitha | గ్లోబల్ సమ్మిట్‌తో ఒరిగిందేమిటో సమగ్ర నివేదిక విడుదల చేయాలి : మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Cyclone Akvan | ఏపీకి మరో తుపాను గండం.. తీరంవైపు కదులుతున్న వాయుగుండం..!
Type 2 Diabetes | మధుమేహం ఉంటే స్వీట్లకు బదులుగా వీటిని తినవచ్చు.. పోషకాలు, శక్తి రెండూ వస్తాయి..
KTR | నిరుద్యోగ యువతకు నాణ్యమైన స్టడీ మెటీరియల్ ఎంతో అవసరం : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు

