Puvwada Ajay Kumar | వైద్య రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక మార్పులను అందిపుచ్చుకోవాలి: మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
Puvwada Ajay Kumar | వైద్య రంగంలో శరవేగంగా వస్తున్న ఆధునిక సాంకేతిక మార్పులను వైద్య విద్యార్థులు, యువ వైద్యులు ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలని మాజీ మంత్రి, మమత వైద్య విద్యాసంస్థల అధినేత పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
ఖమ్మం : వైద్య రంగంలో శరవేగంగా వస్తున్న ఆధునిక సాంకేతిక మార్పులను ( Modern technological changes ), నూతన చికిత్సా విధానాలను వైద్య విద్యార్థులు, యువ వైద్యులు ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలని మాజీ మంత్రి, మమత వైద్య విద్యాసంస్థల అధినేత పువ్వాడ అజయ్ కుమార్ ( Puvwada Ajay Kumar ) అన్నారు.
మమత మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో ‘సాల్వింగ్ ది అన్సాల్వ్డ్’ అనే థీమ్‌తో నిర్వహించిన ఆర్థోపెడిక్ సదస్సులో (CPD Conference) ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గతంలో కంటిన్యూయస్ మెడికల్ ఎడ్యుకేషన్ (CME) అని పిలిచే సదస్సులను నేటి తరం కంటిన్యూయస్ ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ (CPD) గా మార్చుకుందని, పేరు ఏదైనా వైద్యులకు నిరంతర అభ్యాసం అత్యవసరమని పేర్కొన్నారు.
ఆపరేషన్ థియేటర్లో ఊహించని క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఇలాంటి సదస్సులు ఎంతో ఉపయోగపడతాయన్నారు.ఈ కార్యక్రమంలో టోసా ప్రెసిడెంట్ అల్వాల్ రెడ్డి,సెక్రటరీ విజయచందర్ రెడ్డి, టోసా ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ పిఎన్విఎస్వీ ప్రసాద్,కో-చైర్మన్ డాక్టర్ హనుమాన్, సెక్రటరీ డాక్టర్ తేజ్ కుమార్,డాక్టర్స్ అరిఫ్,రాజ్ కుమార్,ప్రసాద్, శ్రీనివాసరావు,తోట లక్ష్మణ్, ప్రిన్సిపాల్ అనురాధ, సూపరింటెండెంట్ రామస్వామి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Puvwada Ajay Kumar | వైద్య రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక మార్పులను అందిపుచ్చుకోవాలి: మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
Gongidi Sunitha | గ్లోబల్ సమ్మిట్‌తో ఒరిగిందేమిటో సమగ్ర నివేదిక విడుదల చేయాలి : మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Cyclone Akvan | ఏపీకి మరో తుపాను గండం.. తీరంవైపు కదులుతున్న వాయుగుండం..!
Type 2 Diabetes | మధుమేహం ఉంటే స్వీట్లకు బదులుగా వీటిని తినవచ్చు.. పోషకాలు, శక్తి రెండూ వస్తాయి..
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు

