ఖైరతాబాద్/మన్సూరాబాద్, డిసెంబర్ 15: తాను మరణిస్తూ ఐదుగురికి అవయవదానం చేశాడు ఆ యువకుడు. మహబూబ్‌నగర్ జిల్లా ఉప్పునూతల మండలం, పెరటివానిపల్లెకు చెందిన ఘంటా వినోద్ (25) స్థానికంగా రెడీమేడ్ షాపు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 10న ద్విచక్రవాహనంపై వెళ్తుండగా, దిండీ గ్రామం వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది.
తీవ్రంగా గాయపడిన అతన్ని చికిత్స కోసం ఎల్బీనగర్లోని కామినేని దవాఖానలో చేర్పించారు. చికిత్స అందిస్తున్న వైద్యులు ఈ నెల 14న బ్రెయిన్‌డెడ్‌కు గురైనట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యులను కలిసిన జీవన్‌దాన్ ప్రతినిధులు అవయవదానం విశిష్టతను వారికి వివరించగా, అందుకు అంగీకరించారు. వినోద్ శరీరం నుంచి కాలేయం, మూత్రపిండాలు, కండ్లను సేకరించారు.