ఖైరతాబాద్, సెప్టెంబర్ 24: దసరా నవరాత్రోత్సవాల్లో భాగంగా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్తాధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా షాపింగ్ బొనంజా లక్కీ డ్రా పంజాగుట్టలోని మానేపల్లి జువెల్లరీస్‌లో బుధవారం వేడుకగా సాగింది. దశాబ్ద కాలంగా పాఠకులకు చేరువవుతూ దసరా పండుగ వేళ విలువైన బహుమతులను అందజేస్తూ ‘నమస్తే’ ముందుకు సాగుతోంది.
ఈ ఏడాది దసరా షాపింగ్ బోనాంజాలో మొదటి బహుమతిగా 32 ఇంచుల టీవీ, రెండో బహుమతిగా మొబైల్ ఫోన్, మూడో బహుమతిగా గిఫ్ట్ వోచర్, నాల్గవ బహుమతిగా గిఫ్ట్ హ్యాంపర్ అందజేస్తోంది. మానేపల్లిలో జరిగిన ఐదో లక్కీ డ్రా సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ గోపీకృష్ణ, నమస్తే తెలంగాణ ఏడీవీటీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రాజి రెడ్డి, వినియోగదారులు ప్రతిభ, సాహిత్యతో క లిసి విజేతలను ఎంపిక చేశారు. మొదటి బహుమతి హారిక (004839), రెండో బహుమతి అభినవ్ (004531), మూడో బహుమతి శివరామకృష్ణ (004839), నాల్గవ బహుమతిని ఎస్.విష్ణువర్ధన్ (005413) గెల్చుకున్నారు.
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే నిర్వహిస్తున్న దసరా షాపింగ్ బొనంజాకు టైటిల్ స్పాన్సర్‌గా సీఎంఆర్ షాపింగ్ మాల్, మేయిన్ స్పాన్సర్‌గా అల్లకాస్, గిఫ్ట్ స్పాన్సర్‌గా బి గ్సీ, పవర్డ్ బై ఆల్మండ్ హౌజ్, ప్రోటీన్ పార్ట్నర్గా వెన్‌కాబ్ ఫ్రెష్ చికెన్, ఇతర స్పాన్సర్లుగా.. హర్షా టోయాటా, కున్ హుందాయ్, వరుణ్ మోటార్స్, మానేపల్లి జువెల్లరీస్, శ్రీ సిల్క్స్, బ్యాంక్ ఆఫ్ బరో డా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇం డియా, టెలివిజన్ పార్ట్నర్గా టీ న్యూస్, డిజిటల్ పార్ట్నర్గా సుమన్ టీవీ వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో యాడ్ మేనేజర్ సురేందర్ రెడ్డి, సికింద్రాబాద్ ఏడీవీటి ఇన్చార్జి యాదగిరి పాల్గొన్నారు.
నాణ్యతకు ప్రాధాన్యతనిస్తున్నాం
పది సంవత్సరాలుగా నమ స్తే తెలంగాణ ప్రతి దసరా పండుగకు వినియోగదారులకు వి లువైన బహుమతులను అందజేయడం గొప్ప విషయం. ప్రస్తుతం బంగారం రేట్లు ప్రపంచంలోనే రికార్డు స్థాయిలో పెరిగాయి. బంగారం కొనుగోలు చేయాలనుకున్న వినియోగదారులు నాణ్యతకు ప్రాధాన్యనిచ్చి మానేపల్లిలో కొనుగోలు చేయడం సంతోషాన్నిచ్చింది. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఇలాంటి కార్యక్రమాలను మున్ముందు మరిన్ని చేపట్టాలి.
– గోపీకృష్ణ, మేనేజింగ్ డైరెక్టర్, మానేపల్లి జ్యువెలర్స్
చాలా హ్యాపీగా ఉంది
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే లక్కీ డ్రాలో పాల్గొనడం ఆనందంగా ఉం ది. దిల్‌సుఖ్‌నగర్‌లోని మానేపల్లిలో కాసులపేరి కొనుగోలు చేశా. లక్కీ డ్రా అంటే ఏదో చిన్న బహుమతి ఇస్తారని అనుకున్నా. 32 ఇంచుల టీవీ రావడం ఆనందంగా ఉంది. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడేకు కృతజ్ఞతలు.
-ప్రతిభ, టీవీ విజేత