Devinavratri Celebrations | క్రికెట్ గ్రౌండ్ ప్రక్కన వెలుగుగుట్ట దేవాలయం నందు శ్రీ దుర్గా పరమేశ్వరి అమ్మవారి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు (ఎనిమిదో రోజు) శ్రీ దుర్గా పరమేశ్వరి అమ్మవారు చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారంలో అత్యంత కన్నుల పండుగగా భక్తులకు దర్శనమిచ్చారు.
ఉదయం అమ్మవారికి పంచామృత అభిషేకము, దుర్గాసూక్తము, శ్రీ సూక్తంతో మహాభిషేకము, మహాలక్ష్మీ అలంకారము, 18 రకాల హారతులు, మహా మంగళహారతి మంత్రపుష్పము అనంతరం సుహాసినిలచే కుంకుమార్చన, తీర్థప్రసాద వితరణ విశేషంగా భక్తుల మధ్య కన్నుల పండుగ జరిగింది. తదనంతరము వేద పండితులచే చండీ హోమము నిర్వహించడం జరిగింది.
అత్యధిక సంఖ్యలో వచ్చిన విద్యార్థులతో సామూహిక సరస్వతీ పూజ చేయడం జరిగింది. అనంతరం భక్తుల నడుమ అన్న ప్రసాద వితరణ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. అలాగే ప్రతీ రోజు సాయంత్రం 6 గంటలకు శ్రీచక్రానికి కుంకుమార్చన, తదనంతరం మహా మంగళహారతి, రాత్రి ఎనిమిది గంటలకు ఊంజల్ సేవ దేవాలయ అర్చక సిబ్బందితో నిర్వహించడం జరుగుతుంది.
ఈ కార్యక్రమాలకు దేవాలయ అర్చక సిబ్బందితోపాటు దేవాలయ కార్యనిర్వాహణాధికారి, కమిటీ సభ్యులు రఘు, మురళీకృష్ణ, శ్రీకాంత్ రెడ్డి అలాగే దాతలు విజయ్ కుమార్, సురేష్ బాబు , రాజకుమార్ పాండే, గొరిగే మల్లేష్ (ఏజీపీ) దంపతులు, ఐరేని సంతోష్, నర్సింగ రావు, శ్రీనివాస్, మంజుల, లక్ష్మి, కవిత, సునీత, విశేషమైన భక్తులు నడుమున ఈ రోజు కార్యక్రమాలు పూర్తయ్యాయి. రేపు అమ్మ వారు దుర్గా దేవి అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు.
Vidadala Rajini | వైసీపీకి షాక్.. విడదల రజినీపై డిజిటల్ బుక్లో ఫిర్యాదు!
Modi-Meloni | మెలోనీ ఆత్మకథకు ప్రధాని మోదీ ముందుమాట.. మరోసారి తెరపైకి ‘మెలోడీ’ మూమెంట్
Road Accident | ఆగి ఉన్న ట్రక్కును ఢీ కొట్టిన బస్సు.. ముగ్గురు మృతి