Cable Bridge | దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి( Cable Bridge ) ఈ నెల 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు మూసివేయబడుతుందని జీహెచ్ఎంసీ( GHMC ) కమిషనర్ లోకేష్‌కుమార్ తెలిపారు. కేబుల్ బ్రిడ్జి నిర్వహణ మ్యానువల్ ప్రకారం కాలనుగుణంగా ఇంజినీర్లచే తనిఖీ చేయాల్సి ఉన్న నేపథ్యంలో ప్రత్యేక పరికరాలు, యంత్రాలు ఆ ప్రదేశంలో వాడబడతాయని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు వాహనదారులు, పాదాచారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్ళాలని కమిషనర్ సూచించారు.