సిద్ధాపూర్పై డంపింగ్ పిడుగు
జీహెచ్ఎంపీ డంపింగ్ చెత్తతో సిద్ధాపూర్ చిత్తు కానున్నది. తమ ప్రాంతంలో చెత్త డంపింగ్ వద్దని ఎన్ని పోరాటాలు చేసినా కొత్తూరు మండల ప్రజల మొరను సర్కార్ ఆలకించలేదు. స్థానిక ఎమ్మెల్యే కూడా ప్రభుత్వంపై ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా పట్టించుకోలేదు. సిద్ధాపూర్ సర్వే నంబర్ 252, 278, 361 సర్వే నంబర్లలలో ఉన్న 86 ఎకరాల భూమిని టీజీఐఐసీ ఎకోటైన్ ప్రాజెక్టు కోసం జీహెచ్ఎంపీకి బదిలీ చేస్తూ గురువారం జీవో జారీ చేసింది.
- ఎకోటౌన్ ప్రాజెక్టుకు భూమి.. జీవో జారీ
కొత్తూరు: జీహెచ్ఎంపీ డంపింగ్ చెత్తతో సిద్ధాపూర్ చిత్తు కానున్నది. తమ ప్రాంతంలో చెత్త డంపింగ్ వద్దని ఎన్ని పోరాటాలు చేసినా కొత్తూరు మండల ప్రజల మొరను సర్కార్ ఆలకించలేదు. స్థానిక ఎమ్మెల్యే కూడా ప్రభుత్వంపై ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా పట్టించుకోలేదు. సిద్ధాపూర్ సర్వే నంబర్ 252, 278, 361 సర్వే నంబర్లలలో ఉన్న 86 ఎకరాల భూమిని టీజీఐఐసీ ఎకోటైన్ ప్రాజెక్టు కోసం జీహెచ్ఎంపీకి బదిలీ చేస్తూ గురువారం జీవో జారీ చేసింది.
తమ ప్రాంతం ఇప్పటికే పరిశ్రమలతో కాలుష్యకారకంగా మారిందని..ఇక్కడ డంపింగ్ యార్డు వద్దే..వద్దని ప్రజలు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్, సిద్ధాపూర్ భూముల్లో వంటా వార్పు లాంటి కార్యక్రమాలు, ఆందోళనలు చేపట్టారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, డంపింగ్ యార్డు ఏర్పాటు వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షుడు ఎమ్మె సత్యనారాయణ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పాల్గొని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. అయినా ప్రభుత్వం ప్రజలు, ప్రజాప్రతినిధులు అభిప్రాయానికి విలువ ఇవ్వకుండా జీవో జారీ చేసిందని మండిపడుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్కు గుడ్ న్యూస్.. వైజాగ్లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

