అద్దె చెల్లించలేదని.. ఈఎస్ఐ డిస్పెన్సరీకి తాళం
అద్దె చెల్లించలేదని మేడ్చల్ ఈఎస్ఐ డిస్పెన్సరీకి భవన యజమాని తాళం వేయడంతో రోగులు, ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు.
- రోగులు, ఉద్యోగులకు ఇక్కట్లు
మేడ్చల్, డిసెంబర్ 11: అద్దె చెల్లించలేదని మేడ్చల్ ఈఎస్ఐ డిస్పెన్సరీకి భవన యజమాని తాళం వేయడంతో రోగులు, ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. దాదాపు మూడు వారాలుగా డిస్పెన్సరీ రోగులకు వైద్యం సేవలందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మేడ్చల్‌లో ఈఎస్ఐ డిస్పెన్సరీ వినాయక్‌నగర్ రోడ్ నంబర్ 2లోని అద్దె భవనంలో కొనసాగుతున్నది. 2022 సెప్టెంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించి అద్దె రూ.53,604 యజమానికి ఖాతాలో జమ కాలేదు. ఆ తర్వాత నెలలు 2023 జనవరి, ఫిబ్రవరి నెలల అద్దె ఖాతాలో జమ అయింది.
ఆ తర్వాత యజమాని రెన్యూవల్ చేసుకోకపోవడంతో అద్దె రాలేదు. యజమాని గత ఏడాదికి సంబంధించిన రెండు నెలల అద్దె రాకపోవడంతో రెన్యూవల్ చేసుకోవడం లేదు. ఆ అద్దె కోసం ఎదురు చూస్తూ నవంబర్ నెల వరకు వేచి చూశాడు. దీంతో విసిగిపోయిన యజమానికి గత నెల 22న డిస్పెన్సరీకి తాళం వేశాడు. అప్పటి నుంచి తాళం తెరవనివ్వడం లేదు. ప్రతి రోజూ 120 నుంచి 150 మంది వరకు మేడ్చల్ డిస్పెన్సరీ వైద్య సేవలు అందిసున్నది. ప్రతి రోజూ మేడ్చల్‌కు వైద్యం కోసం వచ్చే రోగులు ఇబ్బంది పడుతున్నారు.
‘యజమానికి అద్దె రావాల్సిన విషయాన్ని, తాళం వేయడంతో పడుతున్న ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. గత ఏడాదిలో రావాల్సిన రెండు నెలల అద్దెకు సంబంధించిన పత్రాలను సమర్పించాం. యజమాని కూడా మానవతా ధృక్పథంతో స్పందించాలి’. అని డిస్పెన్సరీ వైద్యుడు చంద్రశేఖర్ తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

