అన్నివర్గాలకు సముచిత గౌరవం
రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కోకాపేటలోని యాదవ,కురుమ సంఘాల ఆత్మగౌరవ భవనాలను రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం, రాజ్యసభ సభ్యుడు లింగయ్య యాదవ్, కురుమ, యాదవ కులసంఘాల ప్రతినిధులతో కలిసి శనివారం ఆయన పరిశీలించారు.
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
మణికొండ, జనవరి 7: రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కోకాపేటలోని యాదవ,కురుమ సంఘాల ఆత్మగౌరవ భవనాలను రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం, రాజ్యసభ సభ్యుడు లింగయ్య యాదవ్, కురుమ, యాదవ కులసంఘాల ప్రతినిధులతో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ… దాదాపు రూ.60 కోట్లకు ఎకరం పలుకుతున్న భూములను యాదవులు, కురుమలకు ఐదెకరాల చొప్పున కేటాయించి, నిర్మాణం కోసం రూ.5కోట్ల నిధులను సీఎం కేసీఆర్ కేటాయించారని గుర్తు చేశారు.
యాదవ,కురుమ ఆత్మగౌరవ భవనాలకు అదనంగా రూ.2కోట్ల 60లక్షల నిధులు అవసరమవుతున్నట్లు ఇంజినీర్లు అంచనా వేశారని, రెండు భవనాల చుట్టూ కాంపౌండ్‌వాల్స్ నిర్మాణాలకు ఆ నిధులను విడుదల చేయించేందుకు సీఎంను కలుస్తామన్నారు. ట్రస్టీ కమిటీలను ఏర్పాటు చేశామని, ఇందులో విద్యావంతులు భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా జనాభా ఉన్న కురుమ, యాదవ సంఘాలు విద్య, ఆర్థికాభివృద్ధిలో ముందుకు సాగాలన్న సంకల్పంతో భవనాలను నిర్మిస్తున్నామని రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం కురుమ అన్నారు.
వెనుకబడిన వర్గాలకు సముచిత స్థానం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని రాజ్యసభ సభ్యుడు లింగయ్య యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, నోముల భరత్ కురుమ, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ రవీందర్, గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్, యాదవ మహాసభ చైర్మన్ రవియాదవ్, రాష్ట్ర కురుమ సంఘం యువత అధ్యక్షుడు అరుణ్‌కుమార్ కురుమ, కురుమ సంఘం ట్రస్టు ప్రతినిధి మల్లేశం కురుమ, రాష్ట్ర కురుమ సంఘ ఉపాధ్యక్షుడు నారాయణ కురుమ, యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు రాంచందర్‌యాదవ్, గండిపేట తాసీల్దార్ రాజశేఖర్, నార్సింగి మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటేశ్ యాదవ్, నార్సింగి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ప్రవీణ్‌యాదవ్, కో-ఆప్షన్ సభ్యులు ప్రశాంత్‌యాదవ్,నాయకులు ఆంజనేయులు యాదవ్, మల్లేశ్‌యాదవ్, రాజేశ్ యాదవ్, రాము యాదవ్, కులసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

