హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో రోజురోజుకు నేరాలు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ ఏదో ఓ మూల హత్యలు, లైంగికదాడులు జరుతూనే ఉన్నాయి. సాయంత్రం అయిందంటే చాలు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. సోమవారం రాత్రి గోల్కొండ (Golconda) పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇద్దరు తాగుబోతులు హల్చల్ చేశారు. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు గోల్కొండలో ఉన్న ఓ కటింగ్ షాప్‌లోకి వెళ్లి విధ్వంసం సృష్టించారు. కటింగ్ షాపు యజమాని నిజామ్పై దాడికి పాల్పడ్డారు. దుకాణంలో ఉన్న వస్తువులన్నింటిని పగులగొట్టారు. సామాన్లు అన్నింటిని చిందరవందరగా పడేశారు. ఈ సందర్భంగా స్థానికులు వారిని అడ్డుకోగా వారిపై కూడా దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
పార్టీ చేసుకుందామని పిలిచి.. విద్యార్థినిపై లైంగిక దాడి
బయో ఇంజినీరింగ్ ఇంటర్న్‌షిప్ కోసం నగరానికి వచ్చిన ఓ విద్యార్థినిపై ఆమె స్నేహితుడు, మరో యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్‌కు చెందిన యువతి (20) చెన్నైలోని ఓ కళాశాలలో బయో ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నది. అదే కళాశాలలో బాచుపల్లి హరితవనం కాలనీకి చెందిన అజయ్ (24) బీటెక్ చదువుతున్నాడు. దీంతో ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది.
యువతి బయో ఇంజినీరింగ్ కోర్సు పూర్తి కావడంతో జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్లో ఇంటర్న్‌షిప్ సీట్ ఇప్పిస్తానని చెప్పిన అజయ్.. ఈనెల 3న ఆమెను చెన్నై నుంచి నగరానికి రప్పించాడు. నిజాంపేట రాజీవ్ గృహకల్ప సముదాయంలోని రూమ్‌కి తీసుకొచ్చాడు. సదరు యువతితో పాటు అజయ్ అతడి స్నేహితుడు హరితో కలిసి మద్యం(వోడ్కా) తాగారు. అర్థరాత్రి దాటిక యువతిపై మొదట అజయ్.. ఆ తర్వాత హరి లైంగికదాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులిద్దరిని అరెస్టు చేశారు.