సిటీబ్యూరో, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్‌కు సంబంధించి 178 కేసుల్లో ట్రాఫిక్ పోలీసులు చార్జీషీటు దాఖలు చేయగా, విచారణ చేపట్టిన స్థానిక కోర్టులు 42 మంది మందు బాబులకు జైలు శిక్ష వేసింది. మిగతా వారికి జరిమానాలు విధించింది. అలాగే వారి డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయాలని ఆర్టీవో అధికారులకు సిఫార్సు చేస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ అధికారులు తెలిపారు.
అబిడ్స్,అక్టోబర్ 4: గోషామహల్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నిబంధనలు పాటించని 17 మందికి న్యాయస్థానం ఒక్కొక్కరికీ రూ. 10,500 చొప్పున జరిమానా విధించింది. అలాగే మరో ఇద్దరికి 500 రూపాయల జరిమానా విధించడంతో పాటు ఐదు రోజుల జైలు శిక్ష వేసింది.