సిటీబ్యూరో, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 16 నుంచి 19 వ తేదీ వరకు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 650 మం ది వాహనదారులపై కేసులు నమోదు చేశారు. వీరిని వివిధ స్థానిక కోర్టుల్లో హాజరుపర్చగా న్యాయమూర్తులు 269 మంది మందుబాబులకు ఒక రోజు నుంచి 18 రోజుల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించారు. డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ కోసం ఆర్టీఓ అధికారులకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సిఫారసు చేయనున్నారు. అత్యధికంగా మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 161 మంది పోలీసులకు చిక్కారు.