సిటీబ్యూరో, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): నగరంలోని నాలుగు ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో పట్టుబడిన రూ.2కోట్ల విలువైన డ్రగ్స్‌ను ఆబ్కారీ అధికారులు దహనం చేశారు. ఆబ్కారీ ఈడీ వి.బి.కమలాసన్‌రెడ్డి కథనం ప్రకారం హైదరాబాద్ యూనిట్‌లోని నారాయణగూడ, సికింద్రాబాద్, అమీర్‌పేట, చార్మినార్ ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో నమోదైన 59 కేసుల్లో పట్టుబడిన 240 కిలోల గంజాయి, 496 కిలోల ఎండీఎంఏ, హశీశ్ ఆయిల్ తదితర మత్తు పదార్థాలను రంగారెడ్డి జిల్లాలోని జీజే మల్టీక్లౌడ్ ప్రై.లి.లో దహనం చేశారు. ఈ డ్రగ్స్ విలువ రూ.2కోట్లకు పైగా ఉంటుందని ఈడీ వెల్లడించారు.