కంటోన్మెంట్: పాతబోయిన్పల్లిలోని మేధా పాఠశాలలో మత్తు దందా వెలుగులోకి వచ్చింది. పాఠశాలపై ఈగల్ టీం దాడులు నిర్వహించి.. నిందితులను పట్టుకోవడంతో పాటు రూ. 40 లక్షల విలువ చేసే 4 కిలోల అల్ఫాజోలం, ముడిపదార్థాలు, యంత్రాలను స్వాధీనం చేసుకున్నది.
యాంటీ నార్కోటిక్ బృందం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబోయిన్పల్లిలో నారాయణ యాదవ్కు చెందిన భవనంలో మేధా హైస్కూల్ నిర్వాహకుడు జయప్రకాశ్ గౌడ్ మరో ఐదుగురితో కలిసి పాఠశాల రెండో అంతస్తులో ఒకవైపు తరగతి గదులుండగా, మరో వైపు మత్తు కలిగించే మాత్రలు, రసాయనాలను తీసుకొచ్చి అల్ఫాజోలం తయారీ చేస్తున్నారు. అధికారులు చేసిన దాడిలో నులి పురుగుల మాత్రలకు ఇతర రసాయనాలు కలిపి గంటల తరబడి మత్తులో ఉండేందుకు నగరంలోని వివిధ కల్లు కౌంపౌండ్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. మేధా పాఠశాల నిర్వాహకుడు జయప్రకాశ్ గౌడ్ గదిలో మత్తు మందు మాత్రలు లభించినట్లు అధికారులు వెల్లడించారు.